Karnataka: భూములను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించిన ముడా

భూ కుంభకోణం వ్యవహారం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న వేళ మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నిన్న వెనక్కు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిన వాటిని తిరిగి తీసుకునేందుకు ముడా అంగీకరించింది. 

karnataka
New Update

MUDA: 

ముడా భూ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుదుపుకు గురయింది. ఈ మొత్తం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారింది. దీని కారణంగా ఆయనను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య భార్య పార్వతి భూముల్ని తిరిగి ఇచ్చేస్తామని నిన్న ప్రకటన చేశారు. వాటి విషయంలో ఈరోజు ముడా కీలక నిర్ణయం తీసుకుంది. భూముల్ని తిరిగి తీసుకునేందుకు అంగీకరించింది. 

 తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ముడాకు చెందిన  14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు నిన్న సిద్ధరామయ్య భార్య పార్వతి ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఈమె కూడా నిందితురాలిగా ఉన్నారు. ఈ భార్య భర్తలతో పాటూ సిద్ధరాయ్య బావమరిది కూడా నిందితులుగా ఉన్నారు. మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇలా దారితీస్తాయని అస్సలు ఊహించలేదు. తన భర్త గౌరవం కంటే ఆస్తులు ఏమీ ముఖ్యం కాదు...అందుకే వాటిని తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నాను అని పార్వతి చెప్పారు.  ఇన్నేళ్లు ఆయన అధికారం నుంచి ఏమీ ఆశించని మాకు ఈ ఆస్తులు తృణప్రాయం. అందుకే ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగిస్తున్నా. ఈ విషయంలో నా భర్త అభిప్రాయం ఏమిటో తెలియదు. నా కుటుంబసభ్యులతోనూ చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయమిదని సీఎం వైఫ్ వివరించారు.  నా భర్త రాజకీయ కుట్రలో ఇరుక్కుపోతున్నారు. అదెంత మాత్రం తాను సహించనని ఆమె అన్నారు. అవసరం అయితే ఎలాంటి దర్యాప్తుకు అయినా సహకరిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి వివరంగా పార్వతి లేఖ రాశారు.

Also Read: నిఘా కోసం పంపితే..ఇజ్రాయెల్ గుఢచారిగా మారిపోయాడు–ఇరాన్ మాజీ అధ్యక్షుడు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe