BIG BREAKING: మహారాష్ట్ర, ఝార్ఖండ్ కౌంటింగ్ ప్రారంభం.. ట్రెండ్స్ ఇవే!

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ.

author-image
By Nikhil
New Update
Maharashtra Election Counting

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేస్తారు. మహారాష్ట్రంలో మొత్తం 288 సీట్లు కాగా.. మేజిక్ ఫిగర్ 145. ఇక్కడ అధికార మహాయుతి, ప్రతిపక్ష ఎంవీఏ కూటమి మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా.. 81 శివసేన, 59 స్థానాల్లో అజిత్‌ పవార్‌ ఎన్సీపీ  పోటీ చేసింది. 101 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసింది. 95 స్థానాల్లో శివసేన ఉద్ధవ్ వర్గం పోటీ చేయగా.. 86 స్థానాల్లో శరద్ పవార్ ఎన్సీపీ పోటీ చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండ్ బరిలో ఉన్న కోప్రీలో ఆయన లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 17 స్థానాల్లో MIM బరిలో ఉంది. జార్ఖండ్‌లో 81 స్థానాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ జరగనుండగా.. ఇక్కడ కూడా ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు