Crime News: భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం

మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం ఫాయిల్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Fire Accident

Maharashtra Fire Accident

Crime News: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం ఫాయిల్ తయారీ కంపెనీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో కార్మికులంతా భయాందోళనకు గురయ్యారు.  ఒక్కసారిగా.. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కార్మికులు, స్థానికులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

ఫ్యాక్టరీలో పేలుడు..

రంగలోకి దిగిన సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది ఫైరింజన్ల సహయంతో ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై చుట్టుపక్కల వారిని ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు  ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అధిక కొలెస్ట్రాల్ ఉంటే పాదాల్లో ఈ లక్షణాలు ఉంటాయి

ఈ ప్రమాదంపై నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ స్పందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చిందాన్నారు. సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి వెళ్లారని, ప్రస్తుతం 8 మంది చెందాగా.. మరికొందరు గాయపడ్డారని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ హర్ష్ పోద్దార్ తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ ఒక్క పని చేయండి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు