Tiruchi: ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం

తిరుచ్చి నుంచి షార్జాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో చిక్కుకుంది. టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు రావడంతో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. ఎపుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. 

author-image
By Manogna alamuru
New Update

Tiruchi to Sharja Air India Flight: 

140 మంది ప్రయాణాలు గాల్లో వేలాడుతున్నాయి. తిరుచ్చి నుంచి షార్జా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో..పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫ్లైట్లో హైడ్రాలిక్ సమస్య రావడంతో ల్యాండింగ్‌కు వీలు కావడం లేదు. దీంతో ఏం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన గంటసేపటికే విమానంలో ప్రాబ్లెమ్ వచ్చింది. దాంతో దానిని తిరిగి తురుచ్చి తీసుకువచ్చినా ల్యాండ్ చేయలేకపోతున్నారు ఫ్లైట్లో.  చాలా సేపటి నుంచి గాల్లోనే విమానం చక్కర్లు కొడుతోంది. దీంతో ఎయిర్ పోర్ట్‌లో కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రయాణికులకు సంబంధించిన వారందరికీ ఇన్ఫర్మేషన్ అందించారు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఏ నిమిషంలో ఏదైనా జరగొచ్చని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. పైలెట్లు... విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంధనం అయిపోయే లోపు ఫ్లైట్‌ను ల్యాండింగ్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ క్రాష్ ల్యాండింగ్ అయితే క్షణమే చేపట్టవలసిన చర్యను ఇప్పటికే సిద్ధం చేశారు. డాక్టర్లను అందుబాటులో ఉంచారు. ఫైర్ ఇంజిన్లు రెడీ గా ఉన్నారు. 

తిరుచి నుంచి షార్జా వెళ్ళాల్సిన AXB613 ఫ్లైట్ గంట నుంచి తిరుచ్చి దగ్గర గాల్లోనే తిరుగుతోంది. మిగతా విమానాలు దీనికి అడ్డురాకుండా వాటి దారులను మళ్ళించారు. ఫ్లైట్ బెల్లీ ల్యాంగ్ కోసం అధికారులు, పైలట్లు ప్రయత్నిస్తున్నారు. మరో  20 నిమిషాల్లో విమానం ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 

 

Also Read: సురక్షితంగా ల్యాండ్‌ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్

Advertisment
Advertisment
తాజా కథనాలు