Madya Pradesh : ఇలాంటి నైవేద్యం ఎక్కడా చూసిఉండరు.. ఏకంగా నాలుకతోనే..

మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్‌ దేవీ ఆలయంలో ఓ భక్తుడు ఏకంగా అమ్మవారికి తన నాలుకను కోసిచ్చేశాడు. దసరా శరన్నవరాత్రులకు అక్కడికి వచ్చిన రామ్‌శరణ్‌ అనే వ్యక్తి అమ్మవారికి సమర్పించిన నైవేద్యం చూసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు. 

durgamatha

Durgamatha

New Update

నవరాత్రుల సమయంలో దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటాం. చాలా మంది ఉపవాసాలు ఉంటారు. కాళ్లకు చెప్పులు లేకుండా అమ్మవారి మాల ధరిస్తుంటారు. నిష్టగా ఉంటూ ధూపదీపాలు పెట్టి తల్లిని పూజిస్తుంటారు. అయితే కొందరి భక్తికి హద్దుల్లేకుండా పోతోంది. మధ్యప్రదేశ్‌లో ఓ భక్తుడు ఏకంగా అమ్మవారికి తన నాలుకను కోసిచ్చేశాడు. మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్‌ దేవీ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన రామ్‌శరణ్‌ అనే వ్యక్తి అమ్మవారికి సమర్పించిన నైవేద్యం చూసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు. 

కోరిన కోర్కెలు తీరుస్తారని..

మూడు అంగులాల వరకు తన నాలుకను కోసి అమ్మవారి దగ్గర పెట్టాడు. అంతేకాకుండా అక్కడున్న ఒక పాత్రలో రక్తంతో నింపాడు. ఇది చూసినవారంతా షాక్‌ అవుతున్నారు. రతన్‌గఢ్‌ అమ్మవారు ఎంతో మహిమగలదని, అందుకే ఆ భక్తుడు నాలుకను సమర్పించాడని భక్తులు అంటున్నారు. ఈ రత్నగఢ్‌ ఆలయాన్ని 2015లో నిర్మించారు.. ఇక్కడి అమ్మవారు ఎంతో దయగలవారని, కోరిన కోర్కెలు తీరుస్తారని చెబుతుంటారు. బింద్‌ జిల్లా లాహర్‌నగర్‌లో ఈ ఆలయం ఉంది. ఇలా నాలుకలు కోసుకుని అమ్మవారికి సమర్పించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తిరిగి నాలుక అమ్మవారు ఎప్పటికైనా తెప్పిస్తారంటూ భక్తులు చెబుతున్నారు. ఇదే క్రమంలో రామ్‌ శరణ్‌ కూడా నాలుక సమర్పించాడని, ఆ తర్వాత కాసేపు ఆలయంలో పడుకుని వెళ్లిపోయినట్టు అక్కడి పూజారి జైకిషన్‌ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నకిలీ టీపొడి గుట్టురట్టు...హైదరాబాద్‌ అడ్డాగా దారుణాలు

#madhya-pradesh #ratan-ghad-devi-temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe