Nithyananda : ఏప్రిల్ ఫూల్..నిత్యానంద చనిపోలేదట..కైలాస దేశం ప్రకటన!

నిత్యానంద చనిపోలేదంటూ స్వయంగా ఆయన ప్రకటించుకున్న దేశం కైలాస కీలక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లుగా వెల్లడించింది.నిత్యానంద భక్తులుకు ఈ ప్రకటన ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి.

New Update
nityananda no more

nityananda no more

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోయినట్లుగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశాడంటూ నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.  నిత్యానంద చనిపోలేదంటూ స్వయంగా ఆయన ప్రకటించుకున్న దేశం కైలాస కీలక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లుగా వెల్లడించింది. జీవ సమాధి అయి చనిపోయారని నిత్యానంద ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ వెల్లడించిన వార్తలను సైతం కొట్టిపారేసింది. నిత్యానంద చనిపోయాడని ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోగా తాజాగా వెలువడిన ఈ ప్రకటన వారికి ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి. కాగా, నిత్యానంద కైలాస సౌత్ అమెరికాలోని ఈక్వెడార్లో ఉంది. 

హీరోయిన్ రంజితతో రాసలీలలు 

సీనియర్ హీరోయిన్ రంజితతో రాసలీలలు సాగించి చాలా ఫేమస్ అయ్యారు నిత్యానంద . భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అనేక అత్యాచారం, అపహరణ ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు కూడా హాజరయ్యారు.  ఆ తర్వాత అకస్మాత్తుగా నవంబరు 2019లో ఇండియా నుంచి మాయమయ్యారు నిత్యానంద . చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిన తదనంతరం ఈక్వెడార్‌ సమీపంలో కైలాస అనే తన స్వంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లు, దానికి తానే ప్రధానిగా ప్రకటించాడు నిత్యానంద. 

అంతేకాదు, దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపారు. ఇక 2022 మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై నిత్యానంద స్పందిస్తూ తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నానని ప్రకటించారు.  నిత్యానంద తన యూట్యూబ్ ఛానల్లో చివరిగా మహాశివరాత్రి రోజు కనిపించారు.  నిత్యానంద స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలం,  2002లో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు. 2003లో కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించాడు.

Also read : తల్లే విలన్.. ప్రియుడి కోసం పిల్లలకు పెరుగులో విషం.. బయటపడ్డ మహిళ భాగోతం!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు