ఇజ్రాయెల్ దుర్మార్గం.. ఆకలితో పిల్లలను చంపి..

42వేల మంది పాలస్తీనీయన్లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌ మరోసారి పౌరులను చంపేందుకు రెడీ అయ్యింది. ఉత్తర గాజాలో హమాస్‌ నేతలకు ఆహారం, నీళ్లు అందకుండా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'ది అసోసియేటెడ్ ప్రెస్' ఈ వార్తను ప్రచురించింది.

New Update

'లొంగిపోవండి.. లేకపోతే ఆకలితో చంపేస్తాం..' ఇదే ఇజ్రాయెల్‌ యుద్ధ వ్యూహం..! గాజా గడ్డపై హమాస్ సైనికులను చంపేందుకు ఇజ్రాయెల్‌ ఆర్మి ఏడాదికాలంగా నరమేధానికి పాల్పడుతోంది. హమాస్‌ నేతలనే లక్ష్యంగా చేసుకోని దాడులకు దిగుతున్నామని చెబుతున్నా వాస్తవరూపం మాత్రం వేరేలా ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్‌ గ్రూప్‌కు చెందినవారి కంటే ఎక్కువగా పౌరులే మరణిస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం. ఒక్క ఏడాదిలోనే దాదాపు 42వేల మంది పాలస్తీనీయన్లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌ మరోసారి పౌరులను చంపేందుకు రెడీ అయ్యింది. ఉత్తర గాజాలో హమాస్‌ నేతలకు ఆహారం, నీళ్లు అందకుండా చేసేందుకు ప్లాన్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడ నివాసముంటున్న 3లక్షల మంది పాలస్తీనీయన్ల గురించి ఆలోచించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Bharat: ఇండియా-కెనడా యుద్ధం.. మధ్యలో బిష్ణోయ్.. వివాదానికి కారణమేంటి?

జనరల్స్‌ ప్లాన్‌.. 

రిటైర్డ్‌ జనరల్స్ బృందంతో ఇజ్రాయెల్ ప్రదాని నెతన్యాహు భేటీ అయ్యారు. అక్కడే ఈ యుద్ధ వ్యూహానికి పునాది పడింది. ఇజ్రాయెల్ పార్లమెంట్‌కు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రణాళికను ప్రతిపాదించింది కూడా. హమాస్‌ నేతలు ఎక్కువగా నివాసమున్న ఉత్తరగాజాకు నీరు, ఆహార సరఫరాను నిలిపివేయాలన్నది ఈ ప్లాన్‌. దీన్ని జనరల్స్‌ ప్లాన్‌ అని పిలుస్తారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'ది అసోసియేటెడ్ ప్రెస్' ఈ వార్తను నివేదించింది.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

ఈ వ్యూహం హమాస్‌ను నామరూపాలు లేకుండా చేయడంతో పాటు అక్కడి పౌర జనాభాకు భరించలేని పరిస్థితులను సృష్టించడానికి వీలు కల్పిస్తోంది. అందుకే మానవ హక్కుల సంఘాలు ఇజ్రాయెల్‌ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో ఆహారాన్ని యుద్ధ ఆయుధంగా ఉపయోగించడాన్ని నిషేధించే అంతర్జాతీయ చట్టాల గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తుననాయి. ఒకవేళ ఇజ్రాయెల్ ఇదే ప్రణాళికను అమలు చేస్తే ఆ చట్టాలను ఉల్లంఘించినట్టే అవుతోంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ ఈ ప్లాన్‌ను ఇంప్లిమెంట్‌ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: జమ్మూకశ్మీర్‌ కొత్త సీఎంగా ఒమార్ అబ్దుల్లా ప్రమాణం.. ఎప్పుడంటే ?

ఆహారం, నీరు, ఔషధం, ఇంధనం లాంటి అత్యవసరలను ఉత్తర గాజాకు అందకుండా చేయాలన్నదే ఇజ్రాయెల్‌ ఆలోచన. అలా చేస్తే హమాస్‌ దళాలు ఆకలితో నీరసించిపోతాయని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని ముగించడానికి, మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయమని హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే ఏకైక మార్గమని ఇజ్రాయెల్ అభిప్రాయపడుతోంది. అయితే ఇది ముమ్మాటికి మానవ హక్కులను కాలరాయడేమనన్న విమర్శలు వస్తున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగే యుద్ధంలో అమాయక పౌరులకు తిండి, నీరు లేకుండా చేసి చంపడం ఉగ్రచర్యగా హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చేసింది మరెవరో కాదు..!

#israel #palasthina
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe