టార్గెట్ ముఖ్యమంత్రులు..సిద్ధరామయ్య చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.  నిన్న  ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే కేజ్రీవాల్ తర్వాత అరెస్ట్ అయిన సీఎంగా  సిద్ధరామయ్య నిలుస్తారు. 

PM Modi : మోదీ.. ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు : సిద్ధరామయ్య
New Update

Karnataka CM Sidhha Ramayya: 

దేశంలో టార్గెట్ ముఖ్యమంత్రుల హవా నడుస్తోందా అంటే అవుననే అనిపిస్తుంది.  బీజేపీ కాకుండా ఇతర పార్టీల ముఖ్యమంత్రులు కుంభకోణాల పేరుతో వరుసగా అరెస్ట్ అవుతుండడమే ఇందుకు నిదర్శనం. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మొదట అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది.  దీంతో హేమంత్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. మద్యం లిక్కర్ పాలసీలో ఈయన మీద సీబీఐ కేసు ఫైల్ చేసింది. దాదాపు మూడు నెలల పాటూ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు దేశంలో అత్యంత కీలకమైన సమయం..ఎన్నికల టైమ్‌లో కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్‌గాకేజ్రీవాల్‌ విడుదల అయి వచ్చారు. అయిఏ ఆయన ముఖ్యమంత్రి ఆఫీసుకు వెళ్ళకూడదని కోర్టు కండిషన్ పెట్టడంతో తన సీఎం పదవికి రాఈనామా చేశారు. మళ్ళీ ఎన్నికల్లో పాల్గొంటానని...ప్రజలే తనను సీఎంగా ఎన్నుకుంటారని కేజ్రీవాల్ చెప్పారు. ఈ ఇద్దరు అయిపోయిన తర్వాత నెక్ట్స్ టార్గెట్ గా కర్ణాటక లైమ్‌ లైట్‌లోకి వచ్చింది. 

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ముడా కుంభకోణం కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో మైసూర్‌ అర్బర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై మొదట లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందులో ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా ఉంటే.. ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్‌, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చారు. దీనిపై విచారణ చేసేందుకు  బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విచారణపై మూడు నెలల్లోగా నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య కుటంబ సభ్యులు లాభాలు పొందారని, అలాగే ముఖ్యమంత్రి అధికారాన్ని సైతం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. టి.జె అబ్రహం అనే సామాజిక కార్యకర్త ఈ వ్యవహారానికి సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ తనపై విచారణకు పర్మిషన్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

ఇప్పుడు తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద ఈడీ కేసు నమోదు చేసింది.  ఇప్పటికే దీనికి సబంధించి పోలీస్ కేసు నడుస్తోంది. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఈడీ సిద్ధరామయ్యతో పాటూ ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామిల మీద ఈడీ కేసు నమోదు అయింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అవడంతో..విషయం మొత్తం సెంట్రల్ చేతిలోకి వెళ్ళినట్టయింది. అందుకే ఇప్పుడు సిద్ధరామయ్యను అరెస్ట్ చేయడం గ్యారంటీ అని వార్తలు వస్తున్నాయి. 

సిద్ధరామయ్య కేసుతో మరో విషయం కూడా తెరపైకి వస్తున్నాయి. సెంట్రల్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వారినే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అంటున్నారు. వరుసగా జార్ఖండ్, ఢిల్లీ, కర్ణాటక ముఖ్యమంత్రుల మీద కేసులు, అరెస్ట్‌లు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోందని చెబుతున్నారు. కర్ణాటక తర్వాత వరుసలో తెలంగాణయే ఉంది అని కూడా అంటున్నారు. కర్ణాటక, తెలంగాణల్లో బీజేపీకు కాంగ్రెస్ గట్టిపోటీనిస్తోంది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఇలా చేస్తోంది అని టాక్ వినిపిస్తోంది. 

Also Read: Cricket: రెండో టెస్ట్‌లోనూ భారత్ విజయం..సీరీస్ క్లీన్ స్వీప్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe