One Nation-One Election: జమిలి ఎన్నికలతో దేశానికి నష్టమా? లాభమా?

జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జమిలి ఎన్నికల వల్ల లాభాలతో నష్టాలు కూడా ఉన్నాయి. దీనిపై కేంద్రం ఎలాంటి విధివిధానాలు ప్రకటిస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఆర్టికల్‌లో చదవండి.

one nation one election
New Update

One Nation-One Election: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్ నిర్ణయం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఒక దేశ- ఒక ఎన్నిక ఏంటి అంటే ఒకేసారి అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్ ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో రాజకీయ పార్టీలు, నేతలు, న్యాయవాదులు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. కాగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై నష్టాలేంటి? లాభాలేంటో చూద్దాం. 

నష్టాలు..

* ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యంత జనాభా కలిగిన దేశాల్లో భారత్ మొదటి రెండు స్థానాల్లో ఉంటుంది. కాగా ఎక్కువ జనాభా కలిగిన భారత్ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరపడం అనేది పెద్ద టాస్క్. అలాగే పారదర్శకతపై అనుమానాలు కలిగే అవకాశం ఉంది.

* ప్రభుత్వాలు గడువులోపే పడిపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యమే దెబ్బతింటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరుగొచ్చనే అనుమానులను వ్యక్తం అవుతున్నాయి.

* భారత రాజ్యంగంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానిపై ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చట్టవిరుద్ధం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ చట్టాన్ని చట్టసభల్లో ఆమోదం పొందితే.. ఇది రాజ్యాంగ విరుద్ధం కిందికి రాదు. వచ్చే శీతాకాలం సమావేశంలో ఈ బిల్లును కేంద్రం.. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

* ఈ ఎన్నికల వల్ల జాతీయ పార్టీలకు మేలు జరుగొచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

* ఇదిలా ఉంటే ఈ ఎన్నికల నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం ఉంటుంది. ఒకేసారి అన్ని ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లాభాలు..

* దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో సహా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.

* ఎన్నికలకు అయ్యే ఖర్చు సగానికి పైగా తగ్గించవచ్చు.

* ఎన్నికలకు సిబ్బంది వినియోగం, వ్యయం, నిర్వహణ భారం తగ్గుతుంది.

* ఒకేసారి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు లేకుండా ప్రభుత్వాలు దృష్టిసారించవచ్చు.

#one-nation-one-election
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe