GCC : భారత్‌ లో పెరుగుతున్న జీసీసీలు…28 లక్షల ఉద్యోగాలకు అవకాశం

భారత్‌ లో 2030 నాటికి 2,200 కు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన రెవెన్యూ 8.71 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయి.

author-image
By Bhavana
New Update
jobs

GCC : తక్కువ జీతాలకే పనికి వచ్చే వారికోసం, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ ఖర్చులు, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ కూడా అనుకూలంగా ఉండడంతో మల్టీ నేషనల్ కంపెనీలు ఇండియాలో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపబిలిటీ సెంటర్ల ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.గత ఐదు సంవత్సరాలలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెంగళూరు, ముంబై, గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పూణె, ఢిల్లీ–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో భారీగా జీసీసీలు ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. 

గత ఐదేళ్లలో...

ప్రస్తుతం ఇండియాలో 1,700 జీసీసీలు ఆపరేట్ అవుతున్నాయని నిపుణుల బృందం అంచనా వేస్తుంది. 2030 నాటికి ఫార్చ్యూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 500 కంపెనీల్లోని 70 శాతం కంపెనీలకు ఇండియాలో జీసీసీలు ఉంటాయని నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిన్నోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసిన రిపోర్ట్ కొద్ది రోజుల క్రితమే అంచనా వేసి పేర్కొంది. గత ఐదేళ్లలో ఇండియాలో భారీగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు నెలకొన్నాయని వివరించింది.

2030 నాటికి వీటి రెవెన్యూ ఏడాదికి 99–105 బిలియన్ డాలర్ల కు చేరుకుంటుందని సమాచారం. ప్రస్తుతం జీసీసీలతో 64.6 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ వస్తుంది. 9–10 శాతం గ్రోత్ నమోదవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.‘ఇండియా జీసీసీ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ది 5–ఇయర్ జర్నీ’ పేరుతో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జిన్నోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాజాగా విడుదల చేశాయి. దీని ప్రకారం, ఇండియాలో జీసీసీలు 2030 నాటికి 2,100–2,200 కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండియా నుంచే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

ఇండియా నుంచే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందించడానికి ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు చాలా ఆసక్తి చూపుతున్నాయి. జీసీసీలు విస్తరించడానికి ఇదొక కారణం. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఫోకస్ పెరగడం కూడా కలిసి వచ్చే అంశంలా ఉంది. ఇండియాలోని సుమారు 500 కి పైగా జీసీసీఐలు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కొత్త తరం టెక్నాలజీతో నడుస్తున్నాయని సమాచారం.

ఇండియాలోని జీసీసీలు, సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఓఈ) లలో సుమారు 1,20,000 ఏఐ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారని ఇప్పటికే సమాచారం ఉంది. కార్యకలాపాలను జరిపే సెంటర్ల నుంచి ఇన్నొవేటివ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా ఈ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కేపబిలిటీ సెంటర్లు ఎదుగుతున్నాయని నాస్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ సింధూ గంగాధరన్ వివరించారు.

8 లక్షలకు...

ఇవి విస్తరించే కొద్దీ కంపెనీల గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాల్లో కీలకంగా మారుతున్నాయని, డిజిటల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాను గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తున్నాయని తెలుస్తుంది. జీసీసీలు విస్తరిస్తుండడంతో వీటిలో పనిచేసే ఉద్యోగులు కూడా పెరుగుతున్నారు. ఈ సెంటర్లలో ప్రస్తుతం 19 లక్షల మంది పనిచేస్తుండగా, 2030 నాటికి ఈ నెంబర్ 25–28 లక్షలకు పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

జీసీసీలు టైర్ 2, టైర్ 3 సీటీలలో కూడా విస్తరించడంతో పాటు, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2000 ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇండియాలో సెంటర్లను ఏర్పాటు చేయడంతో 2018–19 నుంచి 2023–24 మధ్య ఈ సెంటర్లు జనరేట్ చేసే రెవెన్యూ 60 శాతం వరకు పెరిగింది..

ఇవి క్రియేట్ చేసిన ఉద్యోగాలు 36 శాతం పెరిగాయి. ప్రపంచానికి జీసీసీ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియా మారిందని, ప్రతి బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియాలో ఏదోలా ప్రాతినిధ్యం ఉందని జిన్నోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ పారి నటజరాజన్ తెలిపారు.

Also Read: కేజ్రీవాల్‌ బెయిల్‌ పై నేడు సుప్రీం తీర్పు!

Advertisment
తాజా కథనాలు