/rtv/media/media_files/2025/08/30/us-visa-restrictions-on-indian-students-2025-08-30-12-43-34.jpg)
అమెరికాలో శాశ్వత నివాసం కోసం కలలు కనే వేలాది మంది భారతీయులకు మరోసారి నిరాశ ఎదురైంది. యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీనే గ్రీన్ కార్డ్ లాటరీ అని కూడా అంటారు. అయితే ఇందులో పాల్గొనేందుకు భారతీయులు అనర్హులుగా ప్రకటించబడ్డారు. ఈ మినహాయింపు కనీసం 2028 వరకు కొనసాగే అవకాశం ఉందని తాజా అప్‌డేట్‌లు వెల్లడిస్తున్నాయి.
కారణమిదే..
వలస జనాభాలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం డైవర్సిటీ వీసా లాటరీని నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం, గత ఐదేళ్లలో 50,000 మంది కంటే తక్కువ వలసదారులను అమెరికాకు పంపిన దేశాల పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు. గత ఐదేళ్లలో భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్తున్న వారి సంఖ్య ఈ పరిమితిని మించిపోయింది. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021లో 93,450 మంది భారతీయులు వలస వెళ్లారు. 2022లో ఈ సంఖ్య 1,27,010 కి పెరిగింది. ఇది దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల నుంచి వచ్చిన మొత్తం వలసదారుల కంటే ఎక్కువ కావడం గమనార్హం. 2023లో కూడా 78,070 మంది ఇండియన్స్ అమెరికాకు వలస వెళ్లారు.
భారత్ నుంచి అమెరికాకు వలసల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, అది లాటరీకి కావాల్సిన అర్హత పరిమితిని దాటిపోయింది. అందుకే భారతీయులు ఈ ఏడాది (DV-2026 సైకిల్‌తో సహా) లాటరీకి ఆటోమేటిక్‌గా అనర్హులయ్యారు. భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాల పౌరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
భారతీయులకు మిగిలిన మార్గాలు
DV లాటరీ మార్గం మూసుకుపోవడంతో, అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందాలనుకునే భారతీయులకు ఇతర మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో:
- H-1B వంటి వర్క్ వీసాల ద్వారా శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవడం.
- కుటుంబ స్పాన్సర్‌షిప్ ద్వారా ప్రయత్నించడం.
- పెట్టుబడుల ఆధారిత వలస (EB-5) ద్వారా దరఖాస్తు చేసుకోవడం.
- అయితే, ఇటీవల అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో, ఈ మార్గాలలో కూడా ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో వేలాది మంది భారతీయుల అమెరికా పౌరసత్వ కలల ఆశలు ఆవిరవుతున్నాయి.
Follow Us