పహల్గామ్ దాడిలో అమరవీరుడైన నేవీ అధికారి భార్య హిమాన్షి ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తన భర్త మృతదేహాన్ని ఉంచిన శవపేటికను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను... మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నువ్వు నీ జీవితంలో అత్యంత అందమైన క్షణాలను గడిపావు, మేము నిన్ను అన్ని విధాలుగా నిన్ను గర్వపడేలా చేస్తామంటూ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి అతనికి వీడ్కోలు పలికింది. ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన వారందరికీ కళ్ళు కనీళ్ళతో నిండిపోయాయి. హిమాన్షి చేయి పట్టుకుని, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు, కానీ వారే తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
This is gut-wrenching. He had just begun a new chapter of life.
— Raghav Chadha (@raghav_chadha) April 23, 2025
6 days into his marriage, Lt. Vinay Narwal was martyred — not on the battlefield, but during his honeymoon.
India grieves, India remembers.
And let it be clear — India will avenge every drop of its heroes’ blood.… https://t.co/vaxHW6x45t
పెళ్లైన ఏడు రోజులకే
పెళ్లైన ఏడు రోజులకే లెఫ్టినెంట్ వినయ్ ఉగ్రవాదుల దాడులో చనిపోయాడు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, హిమాన్షిల పెళ్లి 2025 ఏప్రిల్ 16న జరిగింది. వారిద్దరూ హనీమూన్ కోసమని జమ్మూకశ్మీర్ కు వెళ్లారు. అక్కడ టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోయాడు. తన కళ్లముందే కట్టుకున్న భర్త చనిపోవడంతో ఆమెకు ఒక్కసారిగా నోటినుంచి మాటరాలేదు. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.