సైనికులకు ఇండియన్ ఆర్మీ గుడ్‌న్యూస్.. సోషల్ మీడియాలో ‘వ్యూ ఓన్లీ’ పాలసీ

ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్టిలో ఉంచుకుని గతంలో విధించిన కఠిన ఆంక్షలను సడలిస్తూ, జవాన్లు, అధికారులు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌‌గా ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చింది.

New Update
social media rules

ఇండియన్ ఆర్మీ సోర్జల్స్, ఆఫీసర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్టిలో ఉంచుకుని గతంలో విధించిన కఠిన ఆంక్షలను సడలిస్తూ, జవాన్లు, అధికారులు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌‌గా ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు భారత సైన్యం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

‘వ్యూ ఓన్లీ’ పాలసీ

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఆర్మీ సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం 'ప్యాసివ్ అబ్జర్వర్స్'గా మాత్రమే ఉపయోగించాలి. రీల్స్ చూడవచ్చు.. కానీ ఆర్మీ జవాన్లు రీల్స్ చేయడానికి వీలులేదు. అంటే, వారు ఇతర పోస్టులను చూడటానికి, సమాచారాన్ని పర్యవేక్షించడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, అందులో కూడా కొన్ని కఠినమైన షరతులు వర్తిస్తాయి.

పోస్టులు, కామెంట్స్ నిషేధం: సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి ఫోటోలు, వీడియోలు లేదా అభిప్రాయాలను పోస్ట్ చేయకూడదు. అలాగే ఇతర పోస్టులపై కామెంట్లు చేయడం, 'లైక్' చేయడం లేదా రియాక్ట్ అవ్వడం కూడా నిషేధించబడింది.

ప్రతిస్పందనపై ఆంక్షలు: మెసేజ్‌లు పంపడం లేదా సామాజిక అంశాలపై బహిరంగంగా స్పందించడం చేయకూడదు. ఏదైనా సమాధానం ఇవ్వాలనుకుంటే అది రిటైర్మెంట్ తర్వాతే చేయాలని సైన్యం స్పష్టం చేసింది.
నకిలీ పోస్టుల గుర్తింపు: సోషల్ మీడియాలో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చే తప్పుడు సమాచారం లేదా నకిలీ పోస్టులను పర్యవేక్షించి, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.

ఇతర ప్లాట్‌ఫారమ్‌లపై నిబంధనలు

ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు X (ట్విట్టర్), యూట్యూబ్, క్వోరా వంటి అకౌంట్లు కూడా కేవలం నాలెడ్జ్, ఇన్‌పర్మేషన్ కోసం మాత్రమే 'ప్యాసివ్'గా ఉపయోగించాలని ఆర్మీ తెలిపింది.
వాట్సాప్, టెలిగ్రామ్: వీటి ద్వారా కేవలం వ్యక్తిగత, వర్గీకరించని సమాచారాన్ని మాత్రమే తెలిసిన వ్యక్తులతో పంచుకోవాలి.
లింక్డ్‌ఇన్: ఉద్యోగ అవకాశాల కోసం లేదా రెజ్యూమ్ అప్‌లోడ్ చేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించాలి.

ఎందుకు ఈ నిర్ణయం?
ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచారానికి దూరంగా ఉండటం సాధ్యం కాదని, సైనికులు ప్రపంచ పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. "స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఓ అవసరమైంది. సైనికులు ఫ్యామిలీతో టచ్‌లో ఉండటానికి, ఇ-బుక్స్ చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, ఆవేశంతో స్పందించడం కంటే, ఆలోచించి ప్రతిస్పందించడం ముఖ్యం" అని ఆయన వివరించారు.

భద్రతా కారణాల దృష్ట్యా, ముఖ్యంగా 'హనీ ట్రాప్' వంటి వాటిల్లో చిక్కుకోకుండా ఉండేందుకు 2020లో సైన్యం 89 యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త మార్పుల ద్వారా సెక్యురిటీ, డిజిటల్ అవగాహన మధ్య బ్యాలెన్స్ పాటించాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు