/rtv/media/media_files/2026/02/09/india-sarvam-ai-2026-02-09-11-52-13.jpg)
Sarvam AI
Sarvam AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, చైనా దేశాలదే ఆధిపత్యం చెలాయించాయి. కానీ, ప్రస్తుతం ఇండియా కూడా ఆ రంగంలో దూసుకుపోతుంది. భారత్‌కు చెందిన 'సర్వమ్ ఏఐ' అనే స్టార్టప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి గ్లోబల్ దిగ్గజాలకు కొన్ని కీలక విభాగాల్లో షాక్ ఇస్తూ, భారతీయ గడ్డపై తయారైన ఈ 'సావరీన్ ఏఐ' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఐఐటీ మద్రాస్ మాజీ విద్యార్థులైన ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్ ఈ సంస్థను స్థాపించారు.
All About Sarvam AI, India's "Sovereign" AI That Beat Google Gemini and ChatGPT https://t.co/qW6gwxp9Mopic.twitter.com/OSzMs4WbAx
— NDTV (@ndtv) February 9, 2026
గ్లోబల్ దిగ్గజాలను వెనక్కి నెట్టిన 'సర్వమ్ విజన్'
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సర్వమ్ ఏఐ, ఇటీవలే సర్వమ్ విజన్, బుల్‌బుల్ అనే రెండు మెయిన్ టూల్స్‌ను రిలీజ్ చేసింది. సర్వం AI టెక్స్ట్-టు-వాయిస్ మార్చే టూల్ కూడా బాగా పని చేస్తోంది. ఇది హిందీ, తమిళం, తెలుగు, మరాఠీతో సహా అనేక భాషలు స్పష్టంగా, సహజంగా మాట్లాడుతుంది. ఇది కాల్ సెంటర్లు, ఆన్‌లైన్ విద్య, ఆడియో వార్తలు, ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ల వంటి సర్వీస్‌లో బాగా ఉపయోగపడుతుంది.
OCRలో రికార్డ్: డాక్యుమెంట్లలోని సమాచారాన్ని గుర్తించే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ విభాగంలో సర్వమ్ విజన్ అద్భుతాలు చేస్తోంది. 'olmOCR-Bench' పరీక్షల్లో ఇది 84.3% ఖచ్చితత్వాన్ని నమోదు చేసి, గూగుల్ జెమిని 3 ప్రో, చాట్‌జీపీటీలను వెనక్కి నెట్టింది.
భారతీయ భాషలకు పెద్దపీట: సాధారణంగా ఏఐ మోడళ్లు ఇంగ్లీష్ డాక్యుమెంట్లను బాగా చదువుతాయి, కానీ సర్వం ఏఐ భారతీయ భాషలు, సంక్లిష్టమైన టేబుల్స్, సరిగ్గా స్కాన్ చేసి అర్థం చేసుకోవడంలో సూపర్ పని చేస్తోది. ఇది తెలుగు, హిందీతో సహా 22 అధికారిక భారతీయ భాషల్లో అత్యంత ఖచ్చితంగా పనిచేస్తుంది.
సర్వమ్ ఏఐ ప్రత్యేకతలు:
బుల్‌బుల్ v3: ఇది టెక్స్ట్‌ను వాయిస్‌గా మార్చే మోడల్. ఇది విదేశీ యాప్‌ల కంటే స్వచ్చమైన భారతీయ యాసతో మాట్లాడుతుంది.
తక్కువ ధర -ఎక్కువ వేగం: గ్లోబల్ మోడళ్లతో పోలిస్తే, సర్వమ్ ఏఐ మోడళ్లు భారతీయ డేటాసెట్లపై శిక్షణ పొందడం వల్ల తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా ఫలితాలను ఇస్తాయి.
ఓపెన్‌హాథీ: ఇది సర్వమ్ విడుదల చేసిన మొదటి హిందీ LLM. ఇది అనువాద రంగంలో జీపీటీ-4 కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చిందని సంస్థ పేర్కొంది.
'సావరీన్ ఏఐ' అంటే ఏమిటి?
ఏ దేశానికి ఆ దేశం సొంతంగా, తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా, తమ సొంత డేటా, వనరులతో నిర్మించుకునే ఏఐనే 'సావరీన్ ఏఐ' అంటారు. భారత్ డేటా భద్రత కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడకుండా, సర్వమ్ ఏఐ వంటి సంస్థల ద్వారా తనకంటూ ఓ సొంత ఏఐ వ్యవస్థను నిర్మించుకుంటోంది. భారతీయ ఇంజనీర్లు కేవలం వినియోగదారులుగా మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి కోర్ ఏఐ టెక్నాలజీని కూడా నిర్మించగలరని సర్వమ్ ఏఐ నిరూపించింది. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా ఒక చారిత్రక విజయమని కేంద్ర ఐటీ శాఖ కూడా ప్రశంసించింది.
Follow Us