ప్రపంచంలో సగం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేసింది. అంబరాన్నింటిన సంబరాలతో కొత్త ఏడాదికి భారతదేశం కూడా స్వాగతం పలికింది. పెద్ద ఉత్తున వేడుకలు చూసుకుంటూ భారతీయులు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఏ కష్టాలు, అడ్డంకులూ లేకుండా జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, తిరుపతి, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. డ్యాన్స్‌లతో యువత అదరగొట్టారు.