మొదటిసారి 26 వేల కంటే ఎగువకు నిఫ్టీ..ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 85, 169 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 26,004 దగ్గర ముగిసింది. 

author-image
By Manogna alamuru
New Update
Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ 

 Share Markets: 

దేశీ మార్కెట్ లో లాభాల హవా నడుస్తోంది. నిన్న జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈరోజు కూడా అదే పంథాలో నడిచింది. కాకపోతే ఈరోజు మార్కెట్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడంతో మార్కెట్ బాగానే ఉండడంతో...నష్టాలతో మొదలైన తర్వాత తర్వాత లాభాల్లోకి పుంజుకున్నాయి. దీంతో మధ్యలో చాలా బాగా ఉన్న మార్కెట్ ముగింపు వచ్చేసరికి ఫ్లాట్‌గా ముగిసింది. దీంతో సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 85, 169 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 26,004 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.60 దగ్గర ముగిసింది. ఆఖరి అరగంటలో బ్యాంకింగ్‌, పవర్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ షేర్లు కాసేపు సూచీలను నిలబెట్టాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు సరికొత్త గరిష్ఠాలను అందుకున్నప్పటికీ.. బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 85 వేలు, నిఫ్టీ 26వేల ఎగువన ముగిసింది. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే...నిఫ్టీ మొదటిసారి 26 ఎగువకు వెళ్ళింది. 

సెన్సెక్స్‌ ఉదయం 84,836.45 పాయింట్ల దగ్గర నష్టాల్లో ప్రారంభమైంది. చాలా సేపటి వరకు ఫ్లాట్‌గా ట్రేడయ్యింది. ఇంట్రాడేలో 84,743.04 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో ఒక్కసారిగా పుంజుకుని 85,247.42 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 255.83 పాయింట్ల లాభంతో 85,169.87 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 63.75 పాయింట్ల లాభంతో 26,004.15 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడగా.. టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, టైటాన్‌, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు