Train : మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర…ఈసారి సిమెంట్ దిమ్మెలు!

రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.పూలేరా – అహ్మదాబాద్‌ రూట్‌లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్‌ దిమ్మెను అడ్డంగా ఉంచారు.దీంతో రైలు సిమెంట్‌ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది.

New Update
మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర…ఈసారి సిమెంట్ దిమ్మెలు!

Train: యూపీలోని కాన్పూర్‌ లో రైలు పట్టాల పై సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పించేంఉదకు గుర్తు తెలియని వయక్తులు యత్నించిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. 

పూలేరా – అహ్మదాబాద్‌ రూట్‌లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్‌ దిమ్మెను అడ్డంగా ఉంచారు. దీంతో రైలు సిమెంట్‌ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తోపాటు కొంత భాగం దెబ్బతిన్నది. ఈ ఘటనపై లోకో పైలట్‌ ఆర్పీఎఫ్‌ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాద ప్రాంతంలో విరిగిన సిమెంట్‌ దిమ్మె భాగాలను అధికారులు గుర్తించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, రెండు రోజుల క్రితం యూపీలో భివాండి-ప్రయాగ్‌రాజ్‌ కాళిందీ ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో పెద్ద ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ట్రాక్‌పై ఉంచిన గ్యాస్‌ సిలిండర్‌ను రైలు ఢీకొంది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలును పట్టాలు తప్పించడానికి జరిగిన విద్రోహ చర్యగా దీనిని భావిస్తున్నామని, ఘటనా స్థలిలో ఒక పెట్రోల్‌ బాటిల్‌, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Also Read: సాయంత్రానికి విధుల్లో చేరాలి..నిరసన చేస్తున్న వైద్యులకు సుప్రీం ఆదేశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు