/rtv/media/media_files/2025/11/06/fotojet-2025-11-06t081749728-2025-11-06-08-18-17.jpg)
Hidden cameras in washrooms
Tamil Nadu: మహిళల హాస్టల్స్‌లోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి కొంతమంది కేటుగాళ్లు వీడియోలు తీయడం చూశాం. మరికొందరు వాటితో బిజినెస్ చేయడం తెలుసు. ఇక్కడ దాదాపు ఈ పనికి పాల్పడేవారు ఎక్కువగా మగవాళ్లే అయ్యుంటారు. కానీ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీలో పనిచేస్తూ అక్కడి హాస్టల్స్‌లో నివాసం ఉంటున్న మహిళల స్నానాల గదుల్లో ఓ మహిళ రహస్యకెమెరాలు పెట్టడం సంచలనంగా మారింది. అంతేకాదు అందులోని వీడియోలను విక్రయించి సొమ్ము చేసుకుంటూ నిచానికి పాల్పంది. ఈ విషయం తెలిసి పోలీసులే ముక్కుమీద వేలేసుకున్నారు.
వివరాల ప్రకారం..కర్ణాటక -తమిళనాడు సరిహద్దులో ఉండి తమిళనాడు పరిధిలోకి వచ్చే డెంకణీకోట పట్టణ సమీపాన నాగమంగలంలో విస్తరించిన ఆ భారీ సెల్‌ఫోన్ల తయారీ పరిశ్రమలో వేలాదిమంది మహిళలు పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేసే వారికి ఒక హాస్టల్ సైతం ఉంది. అందులో రెండువేల మంది ఉండడానికి వీలవుతుంది. అయితే సెల్‌ఫోన్ల తయారీ సంస్థలో పనిచేసే ఉద్యోగినులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. వారుంటున్న హాస్టల్ బిల్డింగ్‌లోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు అమర్చారన్న విషయం బయటకు పొక్కడంతో మహిళలంతా ఆందోళనకు దిగారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు.. మహిళలు స్నానాలు చేసే గదుల్లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను విక్రయించి వ్యాపారం చేస్తున్నారనే సమాచారం రావడంతో వారంతా ఆందోలనకు దిగారు. విధులు ముగించుకుని వచ్చినవారంతా ఈ విషయమై కూపీ లాగితే.. కెమెరాలు అమర్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
విషయం తెలిసి దీనికి బాధ్యులెవరో తేల్చాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి దాటినా ఆందోళన ఆగకపోగా మరింత తీవ్రమైంది. విషయం తెలిసి కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురై, డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజ్, సీఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఏమాత్రం వినలేదు. నిందితులను అరెస్టు చేసేవరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగానే పోలీసులు అధికారిక నిఘా కెమెరాల వీడియోలను పరిశీలించారు. అందులో కెమెరాలు అమర్చింది ఎవరో తెలిసి షాక్ అయ్యారు,ఒడిశా రాష్ట్రానికి చెందిన నీలకుమారి అనే మహిళే స్నానాల గదుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు పోలీసుల నిర్ధరించారు. వాటిలో నిక్షిప్తమైన వీడియోలను బెంగళూరులో సంతోశ్ అనే వ్యక్తికి పంపించి.. వాటి ద్వారా వ్యాపారానికి చేస్తున్నట్లు తేలింది. పోలీసులు నీలకుమారిని అరెస్టు చేయడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన విరమించారు.
Follow Us