Bengaluru: దర్శన్ బెయిల్‌ను మళ్ళీ కొట్టేసిన బెంగళూరు కోర్టు

హీరో దర్శన్‌కు మళ్ళీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బెయిల్ కోసం అతను వేసిన పిటిషిన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దర్శన బళ్ళారి జైల్లో ఉంటున్నారు.  అయితే ఇక్కడ నుంచి దర్శన్‌ను బెంగళూరుకు జైలుకు తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Pavitra Gowda- Darshan: శృంగార ఫొటోలు పంపి.. ఉచ్చులోకి లాగి: రేణుకాస్వామి హత్యలో సంచలన నిజాలు!
New Update

Hero Darshan: 

ఫ్యాన్ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ యాక్టర్ దర్శన్ ఏ2 నిందితుడిగా ఉన్నారు. రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్ జూన్ 11న అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే అక్కడ విలాసవంతమైన వసతి లభించినట్టు బయటకు రావడంతో అతన్ని బళ్లారి జైలుకు తరలించారు. హత్యానేరం కింద జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిజం ఒప్పుకున్నాడని చెప్పారు. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో చేశారు. ఇందులో దర్శన్‌తో పాటూ పవిత్ర మరికొందరు కూడా నిందితులుగా ఉన్నారు.

Also Read: Canada: ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా

నో బెయిల్..

అరెస్ట్ అయిన దగ్గర నుంచి దర్శన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అతని ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. ఇప్పుడు మళ్ళా ఒకసారి బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.  నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దర్శన్ హైకోర్టులో మరోసారి బెయిల్ అప్పీల్ చేసుకుంటారని...అతని న్యాయవాదులు చెప్పారు. 

Also Read: పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన

బెంగళూరు జైలుకు..

అయితే దర్శన్‌ను బళ్ళారి జైలు నుంచి బెంగళూరుకు జైలుకు తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దర్శన్ కుటుంబ సభ్యులు ఇప్పటికే మెడికల్ రిపోర్టును సిద్ధం చేశారు. అనారోగ్యం కారణంగా బెంగుళూరుకు షిఫ్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దర్శన్ గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషాన్నే దర్శన్ తరపున కోర్టులో సివి నగేష్ వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్ వాదన న్యాయమూర్తికి సమంజసంగా అనిపించడంతో దర్శన్‌కు బెయిల్‌ నిరాకరించింది. దీంతో దర్శన్ కుటుంబం, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బెయిల్ కోరుతూ దర్శన్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడం ఒక ఆప్షన్ కాగా అనారోగ్యం కారణంగా 57వ సీసీహెచ్ కోర్టులో మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం మరో ఆప్షన్ అని అంటున్నారు. 

Also Read: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe