Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వర్షాలు..

ఈరోజు పడిన భారీ వర్షానికి బెంగళూరు మునిగిపోయింది. చాలా ప్రదేశాల్లో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో ఉద్యోగులు ఇళ్ళకు వెళ్ళడానికి ఇబ్బందులు పడ్డారు. రేపు కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉండడం వలన..బెంగళూరులోని అన్ని పాఠశాలలకు డిప్యూటీ కమిషనర్ సెలవు ప్రకటించారు.

bengaluru
New Update

Heavy Rain In Bengaluru: 

బెంగళూరులో మాన్యతా టెక్ పార్క్‌ లోని రోడ్లమీద వరద నీరు ఏరులై పారుతోంది. బెంగళూరులో కురిసిన భారీ వర్షంతో  రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో పాటూ టెక్ పార్క్ సమీపంలోని నాగవార ఫ్లైఓవర్ కూడా వర్షం కారణంగా జలమయమైంది. మాన్యతా టెక్ పార్క్‌లోని చాలా కంపెనీలు నీటితో నిండి ఉన్నాయి. దీంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్లు క్లియర్ అయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాలని కంపెనీలు కూడా ఉద్యోగులకు చెప్పాయి. బెంగళూరులో మరికొన్ని చోట్ల కూడా భారీ వర్షం కురిసింది. ఆర్‌జిఎ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్, సర్జాపూర్ రోడ్‌లోని విప్రో గేట్, అలాగే ఐటీపీఎల్‌లోని హూడి సమీపంలోని ప్రాంతాలు, ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద ముంపులో ఉన్నాయి. ఇక రేపు కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. కొన్ని కంపెనీలు అక్టోబర్ 16న ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని ఆదేశించాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా..ఉద్యోగుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 

Also Read: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక

ట్రాఫిక్ జామ్..

మామూలుగానే బెంగళూరులో రోడ్లన్నీ ఎప్పుడూ ట్రాఫిక్‌తో నిండిపోయి ఉంటాయి. దానితోడు ఇవాళ పెద్ద వర్షం పడింది. దీంతో సాయంత్రం నుంచి ఇప్పటి వరకూ కూడా జనాలు రోడ్ల మీనే ఇరుక్కుపోయారు. వర్షం నీరు కారణంగా వాహనాలు చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. చాలా స్కూళ్ళ బస్సులు కూడా గంటలు, గంటలు ట్రాఫిక్‌లో నిలిచిపోయాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరోవైపు అక్టోబరు 16న చిన్నస్వామి స్టేడియంలో జరిగే భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా ఈరోజు కూడా ఇరు జట్లు ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నాయి.

Flights: ఎయిర్ ఇండియా మరికొన్ని విమానాలకు బాంబుల బెదిరింపు

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe