/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)
Supreme Court
వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో 70కి పైగా పిటిషన్లు నమోదైయ్యాయి. వాటన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ ప్రారంభించింది. పార్లమెంట్ లో అమోదం పొంది చట్టంగా మారిన అంశంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. పలు చోట్ల నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమలులోకి వచ్చింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుంది.
Supreme Court to hear at 2 PM today the petitions challenging the Waqf Amendment Act 2025.
— Live Law (@LiveLawIndia) April 16, 2025
A bench of CJI Sanjiv Khanna, Justice Sanjay Kumar and Justice KV Viswanathan will hear the matters.
Follow this thread for LIVE UPDATES.#SupremeCourt #WaqfAmendmentAct pic.twitter.com/1kWOH9EOKq
వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని MIM ఎంపీ అసదుద్దీన్ పిటిషన్ సహా ఇప్పటికే పది పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ బోర్డు అధికారాన్ని తగ్గించేలా కొత్త చట్టం ఉందని ముస్లీం నాయకులు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ చట్టంపై స్టే విధించే అంశంపై తాను ఎలాంటి వాదనలు వినడం లేదని సీజేఐ సంజీవ్ ఖన్నా అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వచ్చే పిటిషన్లను విచారించడంలో, నిర్ణయించడంలో సుప్రీంకోర్టుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు.