హర్యానా,జమ్మూ–కాశ్మీర్‌‌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

హర్యానా, జమ్మూ–కాశ్మీర్‌‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8 విడుదల చేయనున్నాయి. వీటిపై ఎగ్జిట్ పోల్స్  ఫలితాలను విడుదల చేస్తున్నారు. దీని ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ కి దెబ్బ తప్పదనే చెబుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update

రెండు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:

జమ్మూ కశ్మీర్

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. అంతకుముందు చివరిసారిగా 2014లో జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఈ మధ్యనే 3 విడతల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన ప్రకారం 3 దశల్లో కలిపి మొత్తం జమ్మూ కాశ్మీర్‌లో 63.88 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక పురుషులు 64.68 శాతం.. మహిళలు 63.04 శాతం.. ట్రాన్స్‌జెండర్లు 38.24 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. గందెర్బల్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా.. నౌషీరా నుంచి బీజేపీ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు రవిందర్ రైనా.. నాగ్రోటా నుంచి బీజేపీ నేత దేవేందర్ సింగ్ రానా.. పీడేపీ పార్టీ తరఫున శ్రీగుజ్వారా-బిజ్బెహరా నుంచి ఇల్తిజా ముఫ్తీ, పుల్వామా నుంచి పీడీపీ తరఫున వహీద్ పారా సహా పలువురు బరిలో నిలిచారు.

హర్యానా

ఇవాళ ఒకే విడతలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ.. మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా సహా కీలక నేతలు బరిలో ఉన్నారు. వీరితోపాటు గత నెలలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై ప్రస్తుతం అందరి దృష్టి పడింది.

ఇదే హర్యానాలో పదేళ్ల క్రితం అంటే 2014లో చాలా మటుకు సర్వే సంస్థలు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా బీజేపీ అధికారం చేపట్టింది. అప్పట్లో బీజేపీ గెలిచి అధికారం చేపట్టబోతోందని న్యూస్ 24-చాణక్య, ఏబీపీ న్యూస్-నీల్సన్ మాత్రమే అంచనా వేశాయి. టైమ్స్ నౌ ఇండియా, ఇండియా టీవీ-సీఓటర్ మాత్రం కాంగ్రెస్ గెలిచే సీట్లను కచ్చితంగా అంచనావేశాయి. 2019లో చూసుకుంటే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు బీజేపీ ఇదే హర్యానాలో 70 సీట్లకు పైగా గెలిచి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. కానీ అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఇండియాటుడే-మై యాక్సెస్ మాత్రం బీజేపీ 32-44 సీట్లు గెల్చుకుని అధికారం ముంగిట నిలిచిపోతుందని అంచనా వేసింది. అలాగే కాంగెస్ 30-42 సీట్లు సాధిస్తుందని కూడా చెప్పింది.

జమ్మూ కాశ్మీర్ విషయానికొస్తే 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీడీపీకి 32-38 సీట్లు వస్తాయని, బీజేపీకి 27-33 సీట్లు వస్తాయని, ఎన్సీకి 8-14, కాంగ్రెస్ కు 4-10 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇవన్నీ తప్పాయి. పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు సాధించాయి. ఎన్సీ 15, కాంగ్రెస్ 12 సీట్లు దక్కించుకున్నాయి. పీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.

ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేస్తున్నారు. వీటి ప్రకారం బీజేపీకి ఈసారి ఎదురు దెబ్బ తప్పదనే అంటున్నారు. అన్ని నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్సే ముందంజలో ఉంది. స్వల్ప తేడాలో అయినా హస్తం పార్టీనే విజయం సాధిస్తుందని చెబుతున్నారు. ఎన్డీటీవీ, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్ ఇలా ఎవరి ఎగ్జిట్ పోల్స్ చేసినా కాంగ్రెస్‌దే ఆధిక్య అని చెబుతున్నారు.

రిపబ్లిక్‌ మ్యాట్రిజ్‌ సర్వే ప్రకారం
కాంగ్రెస్‌: 55-62
భాజపా 18-24
ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 3-6
జేజేపీ: 0-3, ఇతరులు: 2-5

పీపుల్స్ పల్స్..హర్యానా

కాంగ్రెస్–49–61
బీజేపీ–20‌‌–2
జేజేపీ– 0–1
ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 2–3
ఆప్: 0

దైనిక్ భాస్కర్..హర్యానా

కాంగ్రెస్‌: 44–54
బీజేపీ : 15–29
ఐఎన్‌ఎలడీ+బీఎస్పీ: 1–5
జేజేపీ: 0-1, ఇతరులు: 0–1

దైనిక్ భాస్కర్..జమ్మూ–కాశ్మీర్

కాంగ్రెస్‌: 35–40
బీజేపీ : 20‌‌–25
పీడీపీ :4–7
ఇతరులు: 12–16


పీపుల్స్ ఫ్లస్..జమ్మూ–కాశ్మీర్
కాంగ్రెస్‌: 46–50
బీజేపీ : 23–27
పీడీపీ: 7–11
ఇతరులు:4–6

ఇండియా టుడే సీ ఓటర్స్..జమ్మూ–కాశ్మీర్

కాంగ్రెస్: 40–48
బీజపీ: 27–32
పీడీపీ: 6–12
ఇతరులు: 6–11

ఎన్డీటీవీ.. జమ్మూ–కాశ్మీర్

 bjp: 20-32,

Congress+NC :46- 50

Haryana

BJP: 23-27,

Congress 50-64

AAP: 0

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe