నిన్న విడుదలైన హర్యానా ఎన్నికలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు హర్యానా ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఏకైక మార్గం ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని ఫాలో అవడం అన్నారు.
USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయని గుర్తు చేశారు. మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్యాలెట్ ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. ఇందుకోసం చట్టసభ సభ్యులు ముందుకు రావాలని జగన్ పిలుపునిచ్చారు.
ఏపీ ఎన్నికల సమయంలోనూ జగన్ అనుమానాలు..
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత సైతం జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎం ట్యాపింగ్ చేశారంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే.. ఏకంగా ప్రజంటేషనే ఇచ్చారు. ఇప్పటీ సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు ఈవీఎం సీఎం అంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారు. హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలైన ఈ సమయంలో జగన్ మరోసారి ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.