Haryana election 2024: కాంగ్రెస్ నోరు తీపి చేయని జిలేబీలు

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఊరించిన విజయం చివరకు తుస్సుమనిపించింది. ఈ ఎన్నికల్లో తమను రక్షిస్తాయనుకున్న జాట్, జిలేబీలు నట్టేట ముంచాయి. ఇప్పుడు అవే జిలేబీలను పంచుకుంటూ హర్యానాలో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది.

New Update
cong

Jalebi Story: 

హర్యానా ఎన్నికల్లో రెండే రెండు పదాలు విపరీతంగా వినిపించాయి. అవి జాట్, జిలేబీ. ఇక్కడ ఎన్నికలు అనౌన్స్ చేసిన దగ్గర నుంచీ కాంగ్రెస్ పేరు ప్రధానంగా వినిపించింది. హస్తం పార్టే గెలుస్తుందని అంచనా వేశారు. దానికి తగ్గట్టే కాంగ్రెస్ కూడా ఉత్సాహంగా ప్రచారాలు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు అదిగో అక్కడే మొదలైంది సరిగ్గా ఈ జిలేబీ కథ.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ...హర్యానాలో గోహనా ప్రాంతంలోని జిలేబీ గురించి మాట్లాడారు. ఆ ఊర్లో మాథు రామ్ హల్వాయి చేసిన జిలేబీ బాక్స్ పట్టుకుని ప్రచారం నిర్వహించారు. 1958లో మాథురామ్ ఈ జిలేబీలను విక్రయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ఆయన మనవళ్లు చూసుకుంటున్నారు. వీటిని ఆ రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు. రాహుల్ గాంధీ వాటినే దేశవ్యాప్తంగా అమ్మాలని...విదేశాలకు ఎగుమతి చేయాలని అన్నారు. దానివల్ల ఉపాధి పెరుగుతుందని అన్నారు. 20వేల నుంచి 50వేల మందికి ఉపాధి దొరకొచ్చన్నారు. మాథురామ్ వంటి వ్యాపారవేత్తలు.. కేంద్రం తీసుకువచ్చిన డిమానిటైజేషన్, జీఎస్టీ వల్ల ఇబ్బందిపడ్డారని చెబుతూ పెద్ద ప్రసంగమే చేశారు .

మామూలుగానే కాంగ్రెస్ మాటలను బీజేపీ తెగ వేళాకోళం చేస్తుంది అందులోని ఇలా జిలేబీల గురించి మాట్లాడితే ఊరుకుంటుందా...వెంటనే దీనిపై కౌంటర్లు వేసింది. అప్పట్లోనే బీజేపీ నేత రవి శంకర్ రాహుల్ గాంధీ జిలేబీ ప్రసంగాన్ని విమర్శించారు. తనకూ గొహనా జిలేబీ అంటే ఇష్టం. అయితే వాటి ఫ్యాక్టరీ అమెరికాలో పెట్టాలని రాహుల్ అంటున్నారు. అసలు వాటిని ఎలా తయారు చేస్తారు..?ఎలా అమ్ముతారు..? అనేవి ముందు ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ప్రసంగాలు రాసేవారు ఆయనకు ఆ విషయాన్ని చెప్పాలి అంటూ ఎద్దేవా చేశారు.  తరువాత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ కూడా జిలేబీ విషయాన్ని ప్రస్తావించారు . ఎన్నికల్లో గెలిచి కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు వస్తారు. ప్రధాని పదవి ఏమైనా మాథురామ్‌ జిలేబీనా పంచుకోవడానికి..? అంటూ ఎద్దేవాగా మాట్లాడారు. 

ఇప్పుడు ఈరోజు కూడా ఓట్ల కౌంటింగ్ మొదలయ్యాక కొంతసేపటికి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దాంతో హర్యానాలో కాంగ్రెస్ నేతలు జిలేబీలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. దీంతో జీలేబీ మ్యాటర్ మరొకసారి తెర మీదకు వచ్చింది.  మొదట కాంగ్రెస్ గెలిచినట్టు అనిపించినా చివరకు హర్యానాలో విజయం బీజేపీనే వరించింది. దీంతో ఇప్పుడు అక్కడ బీజేపీ నేతలు అవే జిలేబీలను పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.  

 

Also Read: హర్యానాలో ఫలించిన  బీజేపీ వ్యూహం..గెలిపించిన సీఎం సైనీ

 

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు