పాపం ఫొగట్‌.. పాలిటిక్స్ లోనూ నిరాశే?

ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్‌ ఫొగట్‌ కు పాలిటిక్స్ లోనూ నిరాశే మిగిలే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటి వరకు ఆధిక్యంలో కొనసాగిన ఫొగట్.. అనంతరం వెనుకంజలోకి వచ్చారు.

author-image
By Nikhil
New Update

పారిస్‌ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్‌ ఫొగట్‌ రాజకీయాల్లో కూడా విజయం తృటిలో చేజార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వినేశ్ తొలి ఎన్నికల్లోనే ఓటమిని చవిచూసే ఛాన్స్ ఉందని ప్రస్తుత ట్రెండ్స్‌ చూస్తే అర్థమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరి జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేశ్‌ ఫొగట్‌ పోటీ చేశారు. తాజాగా వెలువడుతున్న ట్రెండ్స్‌ ప్రకారం ఫలితాల్లో వినేశ్‌ ఫొగట్‌ వెనుకంజలో ఉన్నారు.

వెంటాడుతున్న దురదృష్టం..

ఒలింపిక్స్‌లో వెంటాడిన దురదృష్టం రాజకీయాల్లోనూ కొనసాగితే అది వినేశ్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చినట్టు అవుతుంది. ఇక ఫలితాల్లో రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం లభించకుండా వెనుకంజలో కొనసాగుతుండడంతో వినేశ్‌ ఫొగట్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి నిరాశతో వెనుదిరిగారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు