Gujarat: 500నోట్లపై అనుపమ్ ఖేర్ బొమ్మ..1 కోటి 30 లక్షల టోకరా

గుజరాత్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. కొందరు మోసగాళ్ళు ఓ బంగారం వ్యాపారికి ఏకంగా కోటిన్నరకు టోకరా వేశారు. అనుపమ్ ఖేర్ బొమ్మ ఉన్న 500 నోట్ల కట్టలతో బంగారం కొనుక్కుని షాక్ ఇచ్చారు. 

gujarath
New Update

Anupam kher Image On 500rs note: 

నకిలీ నోట్లతో మోసాలు చాలానే జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి వాటిని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. ఎవ్వరూ గుర్తు పట్టలేని విధంగా నకిలీ ఓట్లను తయారు చేస్తుంటారు. వ్యాపారస్తులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నకిలీ నోట్లను గుర్తుపట్టే మిషన్లు కూడా ఇప్పుడు అందుబాట్లో ఉన్నాయి. ముయంగా బంగారం షాపుల్లో ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి. అందుకే అక్కడ డబ్బులను ఒకటికి రెండుసార్లు పరీక్షిస్తుంటారు ఏ మాత్రం అనుమానమొచ్చినా నోట్లను తీసుకోరు. అలాంటి ఈ రోజుల్లో గుజరాత్‌లో ఓ బంగారం షాపు యజమానికి పెద్ద షాక్ ఇచ్చారు ఘరానా మోసగాళ్ళు. 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బంగారం, వెండి వ్యాపారి అయిన మెహుల్ థక్కర్‌కు తనకు తెలిసిన లక్ష్మీ జ్యువెలర్స్ మేనేజర్ నుంచి సెప్టెంబర్ 23న ఫోన్ వచ్చింది. థర్డ్ పార్టీ కోసం 2 కిలోల బంగారం కావాలని చెప్పాడు. మరుసటి రోజు, సెప్టెంబర్ 24న మళ్ళీ మేనేజర్ ఫోన్ చేసి కొనుగోలుదారుకు బంగారం అత్యవసరమని..  వ్యాపారి ఠక్కర్‌కు చెప్పాడు.  అయితే RTGS (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్)లో సాంకేతిక సమస్య కారణంగా కస్టమర్ నగదు రూపంలో సెక్యూరిటీ డిపాజిట్‌ని అందజేసి, మిగిలిన మొత్తాన్ని తర్వాత బదిలీ చేస్తారని చెప్పాడు. దీనికి ఠక్కర్ సరే అన్నారు. తర్వాత నవరంగ్‌పురా ప్రాంతంలోని అంగాడియా (సాంప్రదాయ మనీ కొరియర్) సంస్థకు బంగాఆన్ని పంపాల్సిందిగా మేనేజర్ చెప్పాడు. దానికి సరే అన్న ఠక్కర్ బంగారాన్ని డెలివరీ చేయడానికి తన ఉద్యోగిలో ఒకరిని పంపారు. అక్కడ అతను ముగ్గురు వ్యక్తులకు బంగారాన్ని ఇచ్చేసి..ఉద్యోగి సెక్యూరిటీ డిపాజిట్ కోటిన్నర డబ్బులు తీసుకుని వచ్చేశాడు.

తీరా వచ్చాక థక్కర్ ,ఉద్యోగి  డిపాజిట్‌గా వచ్చిన మనీని చెక్ చేయగా...మొత్తం మోసం బయటపడింది. ఇచ్చిన డబ్బు మొత్తం నకిలీ నోట్లని గుర్తించారు. మొత్తం 500 రూప నోట్లు...అన్నీ నకిలీవే. అన్నింటికంటే విచిత్రం ఏటంఏ...అన్ని నోట్ల మీద మహాత్మా గాంధీ చిత్రానికి బదులుగా...బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో పాటూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి బదులుగా "స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" స్టాంప్‌ ఉన్నాయి. దీంతో బంగారం వ్యాపారి ఠక్కర్ లక్ష్మీ జ్యయెలర్స్ మేనేజర్ కు కాల్ చేసి జరిగినదంతా చెప్పారు. ఇద్దరూ కలిసి తమ దగ్గర బంగారం కొన్న థర్డ్ పార్టీకి కాల్ చేశారు. కానీ అప్పటికే వాళ్ళు మూటా ముల్లే సర్దుకుని పారిపోయారు. ఫోన్ స్విఛాఫ్ చేసుకున్నారు. అంతేకాదు వాళ్ళు రిఫరెన్స్ చెప్పిన అంగాడియా అనే సంస్థ కూడా ఉత్తుత్తిదేనని తెలిసింది. దీంతో బంగారం వ్యాపారి ఠక్కర్ అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు ఈ కేసుపై దర్యాప్తును మొదలుపెట్టారు డబ్బులు ట్రాంజాక్షన్ జరిగిన చోట సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఇన్సిడెంట్ మీద నటుడు అనుపమ్ ఖేర్ కూడా స్పందించారు.  500 రూ.ల మీద నా ఫోటోనా అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్త పరిచారు. ఈరోజుల్లో ఏదైనా జరగవచ్చని...జాగ్రత్తగా ఉండాల్సిందేనని కామెంట్ చేశారు. 

Also Read: వరుసగా మరణిస్తున్న ఛీఫ్‌లు..హమాస్ ఛీఫ్‌ కూడా ఖతం

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe