/rtv/media/media_files/2025/02/06/6mW0uov9dWfVRmookHko.jpg)
gold smagling Photograph: (gold smagling)
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా స్మగ్లింగ్ గోల్డ్ పట్టబడింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం అక్రమంగా రవాణా చేస్తున్న 10కిలోల బంగారం దొరికింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన 43, 45 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులు మిలాన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. వారి దగ్గర నుంచి రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో వారి లగేజీని స్కాన్ చేయగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ ఇద్దరు ప్రయాణికుల్ని వ్యక్తిగతంగా తనిఖీ చేయగా సుమారు 10 కిలోల బంగారం పట్టుబడింది.
The Air Intelligence Unit (AIU) of Customs, IGI Airport, New Delhi, intercepted two male passengers (aged 45, 43 years) belonging to Kashmir, arriving from Milan via Flight AI-138 on 05.02.2025. A personal search of the passengers led to the discovery of 10.092 kg of gold, valued… pic.twitter.com/8tWC0yB7na
— ANI (@ANI) February 6, 2025
Also Read : సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
స్పెషల్‌లో ఓ బెల్ట్ చేసి.. అందులో కోట్ల విలువ చేసే బంగారాన్ని కాయిన్స్‌గా మలిచి పెట్టారు. రెండు బెల్ట్‌లో బంగారు నాణేలను ప్లాస్టిక్ ఎన్వలప్‌లో చుట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు చెకింగ్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన పసిడి విలువ దాదాపు రూ.7.8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ఆ ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.