/rtv/media/media_files/vxPR1S6Lcuaa3vh3qUzK.jpg)
Tamil Nadu:తమిళనాడులో బాలికల హాస్టల్‌లో సిలిండర్ పేలింది. ప్రమాదంలో ఇద్దరు మహిళా సిబ్బంది మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే మహిళలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.