/rtv/media/media_files/2025/01/08/5bpopJdUfiQ7nEIgHCkF.jpeg)
PM Modi
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సెంట్రల్ కేబినెట్ ఆమోతం తెలిపింది. 2026 నాటికి కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 7వ వేతన సంఘం సిఫార్సులను ఇప్పటికే అమలు చేశామని ఆయన స్పష్టం చేశారు.
Union Cabinet has approved the proposal to set up the 8th Central Pay Commission: Union Minister @AshwiniVaishnaw #CabinetDecisions | pic.twitter.com/g5pPUCgdWX
— All India Radio News (@airnewsalerts) January 16, 2025
వేతన సంఘం సిఫార్సుల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ జీతాలు పెరగనున్నాయి. 2026 జనవరి నాటికి కొత్త వేతనాలు అమలులోకి రానున్నాయి. ఈ దిశగా తర్వరలో కమిషన్ ఛైర్మన్‌ను కూడా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 53 శాతానికి పెరిగిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం ఎప్పుడు వేస్తారాని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మోదీ సర్కార్ ఎట్టకేలకు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతి 10 సంవత్సరాలకో కొత్త పే కమిషన్
భారత ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ నిర్ణయంతో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరునుంది. దీనితో పాటు 64.89 లక్షల మంది పెన్షనర్లు కూడా దీని ద్వారా లబ్ది పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, అలవెన్సులు, బేసిక్ సాలరీ పెంపు వంటి బెనిఫిట్స్ అందుతాయి.
జీతం ఎంత పెరగనుంది ?
8వ పే కమిషన్‌లో కనీస వేతనం రూ.34,560 వరకు ఉంటుందని సమాచారం. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92గా ఉంటే, దాని సహాయంతో దేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.34,560కి పెరగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల నుండి పదవీ విరమణ పొందిన వారికి రూ.17,280 పెన్షన్ వస్తుంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం 8వ వేతనాల సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92గా నిర్ణయించవచ్చని, కొన్ని రిపోర్ట్స్ లో కనీసం 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తుందని చెబుతున్నాయి.