Union Budget 2026 : బడ్జెట్ 2026:  ఎన్నికల రాష్ట్రాలకు నిర్మలమ్మ వరాల జల్లు!

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తూనే, దేశాభివృద్ధికి ఆమె సరికొత్త బాటలు వేశారు.

New Update
nirmama

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తూనే, దేశాభివృద్ధికి ఆమె సరికొత్త బాటలు వేశారు. త్వరలో ఎన్నికల జరగబోయే రాష్ట్రాలకు ఆమె తన బడ్జె్ట్ లో స్పెషల్ గిఫ్ట్స్ అందించారు. 

తమిళనాడు,  కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి, జీడిపప్పు, గంధం చెట్ల సాగుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. కేరళలో కొత్తగా టెక్స్‌టైల్ పార్క్, అలాగే వైల్డ్‌లైఫ్ టూరిజం కోసం కడువ (క్యాన్సర్) కట్టల అభివృద్ధి వంటివి ప్రకటించి అక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్  ప్రకటించారు. ఇది బెంగాల్‌లోని పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. బెంగాల్‌కు వారణాసి-సిలిగుడి, తమిళనాడుకు హైదరాబాద్-చెన్నై వంటి హైస్పీడ్ కారిడార్లతో ప్రయాణ వేగాన్ని పెంచబోతున్నారు.

హెల్త్ రంగంలో భారీగా ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 5 రీజనల్ మెడికల్ హబ్‌ల ఏర్పాటు ద్వారా హెల్త్ రంగంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. దీనివల్ల మెడికల్ రంగంలో ముందుండే కేరళ ప్రజలకు (ముఖ్యంగా నర్సులకు) ఎక్కువ లబ్ధి చేకూరనుంది. రూ. 40 వేల కోట్లతో సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభించారు. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మన దేశంలోనే చౌకగా తయారయ్యేలా ఈ నిధులు తోడ్పడతాయి.

పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్రం భారీగానే ప్రకటనలు చేసింది. ప్రస్తుతం అస్సాంలో బీజేపీ సర్కార్ ఉంది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పాలిస్తోంది, మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేరళను సిపిఐ (ఎం), ఇతర వామపక్ష పార్టీల సంకీర్ణమైన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) పాలిస్తోంది, పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు