Toilet paper: విసిగిపోయాడు.. టాయిలెట్ పేపర్ పై రిజైన్ లెటర్!

తాను పనిచేసే కంపెనీ తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి టాయిలెట్ పేపర్‌పై రాజీనామా లేఖ రాశాడు. సింగపూర్‌కు చెందిన బిజినెస్ ఉమెన్ ఏంజెలా యో ఈ లెటర్‌‌ను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

New Update
singapoor resignation

singapoor resignation

తాను పనిచేసే ఓ కంపెనీ తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి టాయిలెట్ పేపర్‌పై రాజీనామా లేఖ రాసాడు. సింగపూర్‌కు చెందిన బిజినెస్ ఉమెన్ ఏంజెలా యో ఈ లెటర్‌‌ను లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘ఈ కంపెనీ నన్ను ఎలా ట్రీట్ చేసిందో తెలిపేందుకే ఇలాంటి పేపర్‌‌ను ఎంచుకున్నా.. ఈ సంస్థలో నన్ను చెత్తలో విసిరిపారేసే టాయిలెట్ పేపర్‌లా చూశారు. అవసరమైనప్పుడు వాడుకుని ఆ తరువాత వదిలేశారు.. పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి కూడా ఆలోచించలేదు.  అందుకనే టాయిలెట్ పేపర్ పై ఈ రాజీనామా లేఖను రాస్తున్నా ’ అని అతడు అందులో రాసుకొచ్చాడు. ఉద్యోగులు బయటికి వెళ్లేటప్పుడు కృతజ్ఞతతో ఉండేలా చూడటం సంస్థ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ఏంజెలా యో అన్నారు. అతడు రాసిన లెటర్ తనను చాలా కదిలించిందని గుండెలో ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటన ఉద్యోగి నిబద్ధత కంటే కంపెనీలో నెలకొన్న విషపూరిత పని సంస్కృతికే అద్దం పడుతోందని ఆమె అన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు