/rtv/media/media_files/2026/02/01/union-budget-2026-02-01-07-24-19.jpg)
మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, నిర్ణయాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ITC Tests Pricing Power Ahead of Budget as Demand Stays Firm
— Prabhakar Singh Bais (@theprabhakars) December 23, 2025
Channel checks across urban markets in South, West and East India suggest that ITC has implemented a retail price hike of around Rs 1 per stick across its cigarette portfolio. The move, coming ahead of the Union…
బడ్జెట్ క్రమంలో దేశంలో అనేక పెద్ద మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. నేటి నుంచి ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత అదనంగా KYC/KYV వెరిఫికేషన్ అవసరం ఉండదు. ఇక పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు ధరలు పెరగనున్నాయి. అలాగే LPG సిలిండర్, CNG, PNG, విమాన ఇంధన ధరల్లో మార్పులకు అవకాశం ఉందని తెలుస్తోంది.
తంబాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (Tax) విధించింది. జీఎస్టీతో పాటు అదనంగా 'హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్' కూడా పడనుంది. దీనివల్ల ధూమపానం, పాన్ మసాలా ప్రియులకు ఖర్చు పెరగనుంది.
హైవేలపై ప్రయాణించే వారికి
హైవేలపై ప్రయాణించే వారికి ఒక మంచి వార్త. NHAI నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాహనాలకు కొత్త ఫాస్టాగ్ తీసుకునేటప్పుడు KYC వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు. దీనివల్ల ఫాస్టాగ్ తీసుకోవడం ఇప్పుడు మరింత సులభం కానుంది.
విమాన ఇంధనం (ATF) ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. ఢిల్లీలో కిలో లీటరుకు సుమారు వెయ్యి రూపాయల వరకు తగ్గింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన టికెట్ల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.
Follow Us