/rtv/media/media_files/2025/10/07/gowda-2025-10-07-18-05-33.jpg)
మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 92 ఏళ్ల దేవెగౌడ ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యంలో మార్పు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రి నిపుణులు దేవెగౌడకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. దేవెగౌడకు ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుదర్శన్ బల్లాల్ నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు.
ಮಾಜಿ ಪ್ರಧಾನಿ HD ದೇವೇಗೌಡರು ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲು..! |GuaranteeNewshttps://t.co/y06RzW1rvW#GuaranteeNews#HDDeveGowdahealthupdate#FormerPrimeMinisterhospitalized#DeveGowdaManipalHospital#HDDeveGowdaillness#JDSleaderhealthnews#GuaranteeNewskannadapic.twitter.com/p3S2UFV3M7
— Guarantee News (@guaranteenews) October 7, 2025
రాజకీయాల్లో చురుగ్గా
దేవెగౌడ చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయన అభిమానులు, జెడిఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంలోని సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన హెచ్‌డి దేవెగౌడకు ఇప్పటికే 92 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జెడిఎస్ పార్ఠీలో ఆయన తనదైన పాత్ర పోషించారు. 2023లో దేవెగౌడ మణిపాల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ సమయంలో శ్వాసకోశ సమస్యలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందించారు. తరువాత ఆయన కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు.
దేశానికి దేవెగౌడ 11వ ప్రధానమంత్రి
తాను రాజకీయాల నుంచి రిటైర్ కావడం లేదని, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వీల్ చైర్‌లోనైనా పార్లమెంటుకు వెళ్తానని దేవెగౌడ ఇటీవల హాసన్‌లో మీడియాతో అన్నారు. భారతదేశానికి దేవెగౌడ 11వ ప్రధానమంత్రి. యునైటెడ్ ఫ్రంట్ (United Front) ప్రభుత్వంలో భాగంగా ఆయన ప్రధాని అయ్యారు. దీనికి ముందు, ఆయన 1994 నుండి 1996 వరకు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.