Saurabh Bharadwaj : హాస్పిటల్ నిర్మాణ కుంభకోణం...మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు!

ఆమ్ ఆద్మీ పార్టీ నేత,  ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సోదాలు చేపట్టింది. సౌరభ్‌ భరద్వాజ్‌ నివాసంతో పాటుగా 12 ప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు.

New Update
AAP leader Saurabh Bharadwaj

ఆమ్ ఆద్మీ పార్టీ నేత,  ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సోదాలు చేపట్టింది. సౌరభ్‌ భరద్వాజ్‌ నివాసంతో పాటుగా 12 ప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఆప్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఆసుపత్రి నిర్మాణ ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తో్ంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంకా వెల్లడించలేదు. కాగా గ్రేటర్ కైలాష్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే  గెలిచిన భరద్వాజ్, ఢిల్లీ ఆరోగ్య, పట్టణాభివృద్ధి, నీటి మంత్రిగా, ఢిల్లీ జల్ బోర్డుకు అధ్యక్షుడిగా, ఆప్ అధికారిక ప్రతినిధులలో ఒకరిగా పనిచేశారు.

2018-19లో రూ.5,590 కోట్ల విలువైన 24 హాస్పిటల్ ప్రాజెక్టుల మంజూరు, అమలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా 2024ఆగస్టులో దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులలో 11 కొత్త ఆసుపత్రులు ఉన్నాయి. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టులు మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని ఆరోపణలున్నాయి.

50 శాతం పనులు మాత్రమే

ఈ ప్రాజెక్టులలో రూ.800 కోట్లు ఖర్చు చేసినా కేవలం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, కొన్ని చోట్ల అనుమతులు లేకుండానే నిర్మాణాలు ప్రారంభించారని ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఈ దాడులను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య రాజకీయ ప్రేరేపితమని ఆరోపించింది. ప్రాజెక్టుల ఆలస్యానికి పరిపాలనాపరమైన సమస్యలు,  విధానపరమైన ఇబ్బందులు కారణమని, ఇది కుంభకోణం కాదని పేర్కొంది. 

సౌరభ్ భరద్వాజ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగారు.  భరద్వాజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, న్యాయశాస్త్రంలో పట్టా కూడా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.  2013లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని 49 రోజుల ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రవాణా, ఆహారం, పర్యావరణం వంటి కీలక శాఖలను చూశారు. 2015, 2020లో కూడా గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. సౌరభ్ భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక కీలకమైన, సుపరిచితమైన అధికార ప్రతినిధిగా ఉన్నారు. టీవీ చర్చల్లో పార్టీ తరపున వాదనలు వినిపించడంలో ఆయనకు మంచి పేరుంది.  2017లో ఒక ఈవీఎం లాంటి యంత్రాన్ని హ్యాక్ చేయడం ఎలాగో ఢిల్లీ అసెంబ్లీలో ప్రదర్శించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దీనిపై ఎన్నికల సంఘం అప్పట్లో ఆయన వాదనలను తోసిపుచ్చింది. సౌరభ్ భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహిత నాయకులలో ఒకరిగా పరిగణించబడతారు. ఈ మధ్యకాలంలో ఆప్ ప్రభుత్వంపై జరుగుతున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పేరు ఎక్కువగా వార్తల్లోకి వస్తోంది.

Advertisment
తాజా కథనాలు