Rituparna KS : నీట్ ఎగ్జామ్లో ఫెయిల్..  కట్ చేస్తే రూ.72లక్షల ఫ్యాకేజీ!

నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫే పోయినట్లుగా చాలా మంది తెగ ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్లకు ఈమె ఒక ఆదర్శమనే చెప్పాలి.  బెంగళూరుకు చెందిన ఇంజనీర్ రీతుపర్ణ కెఎస్, నీట్ కు అర్హత సాధించలేదు.

New Update
job

నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫే పోయినట్లుగా చాలా మంది తెగ ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్లకు ఈమె ఒక ఆదర్శమనే చెప్పాలి.  బెంగళూరుకు చెందిన ఇంజనీర్ రీతుపర్ణ కెఎస్, నీట్ కు అర్హత సాధించలేదు. దీంతో ఆమె బాధపడకుండా ఇంజనీరింగ్‌పై దృష్టి పెట్టారు. ఆ  తర్వాత మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఆమె ఆరవ సెమిస్టర్‌లో చదువుతుండగా లగ్జరీ కార్ల సంస్థ అయిన రోల్స్ రాయిస్‌తో ఎనిమిది నెలల ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసింది. ఆ తరువాత అదే కంపెనీలో రూ. 39.6 లక్షల జీతానికి జాబ్ లభించింది. ఏప్రిల్‌లో అది రూ.72.3లక్షలకు చేరుకుంది.

 ఇంజనీరింగ్ వైపు మొగ్గు

ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు కావడం విశేషం. దీంతో ఆమె దేశంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరిగా నిలిచింది.   కర్ణాటకలోని తీర్థహళ్లి తాలూకాలోని కోడూరుకు చెందిన రీతుపర్ణ మొదట్లో డాక్టర్ కావాలని  అనుకుంది. అయితే నీట్ ఎగ్జామ్ లో ప్రభుత్వ సీటుకు అర్హత సాధించకపోవడంతో  ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపింది. 2022లో CET ద్వారా సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ పొందింది. రోబోటిక్స్, ఆటోమేషన్‌లో BE కోర్సులో చేరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు