BIG BREAKING: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు!

ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నేడు బెంగళూరులోని ఎంఎస్​ రామయ్య ఆస్పత్రిలో చేర్చారు. జ్వరం, స్వల్ప శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నేడు బెంగళూరులోని ఎంఎస్​ రామయ్య ఆస్పత్రిలో చేర్చారు. జ్వరం, స్వల్పంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వెంటనే ఆసుపత్రిలో చేరగా.. సిబ్బంది అతనికి ప్రాథమిక పరీక్షలు చేశారు. అయితే.. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఖర్గే ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే.. ఆస్పత్రిలో ఆయన రెండు మూడు రోజులు ఉండనున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ ఆధారంగా వైద్యులు ఆయన చికిత్సపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: Vijaya Dashami 2025: దుర్గా పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ!-PHOTOS

ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో..

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుల్లో ఒకరు. ఇతను సోనియా గాంధీ తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. చాలా రోజుల నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1942లో జన్మించిన ఖర్గే రాజకీయంలో దశాబ్దాల నుంచి ఉన్నారు. ఇతను పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ అగ్రనేత అయిన ఖర్గే అనారోగ్యానికి గురి కావడంతో కాంగ్రెస్  నేతలు ఆందోళన చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Karur stampede : కరూర్‌ తొక్కిసలాటలో సంచలన విషయాలు.. పగిలిన మృతుల ఊపిరితిత్తులు

Advertisment
తాజా కథనాలు