/rtv/media/media_files/2025/11/12/ayodhya-ram-temple-and-kashi-vishwanath-temple-were-the-targets-of-delhi-blast-terrorists-1-2025-11-12-14-52-43.jpg)
Ayodhya Ram Temple and Kashi Vishwanath Temple were the targets of Delhi blast terrorists
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబ్ బ్లాస్ట్ యావత్ దేశాన్ని కుదిపేసింది. అది కూడా ఎర్రకోట వంటి ప్రముఖ ప్రాంతంలో ఈ పేలుడు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాదుల లక్ష్యాలపై సంచలన విషయాలను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. పట్టుబడిన ఉగ్రవాదులను విచారించగా.. వారు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
Delhi Bomb Blast
ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఒక పొరపాటుగా జరిగిందని.. వారి అసలు లక్ష్యం వేరే ఉందని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. వారి ప్రధాన లక్ష్యాలలో అత్యంత సున్నితమైన ప్రాంతాలు ఉన్నట్లు సమాచారం. వాటిలో అయోధ్యలోని శ్రీ రామమందిరం, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. దేశంలో అత్యంత కీలకమైన అయోధ్యలోని శ్రీ రామమందిరం ఆలయం ఉగ్రవాదుల లక్ష్యాల్లో ప్రముఖంగా ఉన్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత వారణాసిలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథ్ ఆలయం దాడికి కూడా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ రెండు సున్నితమైన హిందూ పుణ్యక్షేత్రాలపై బ్లాస్ట్ జరిపేందుకు భారీ కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించి పలు డాంక్యుమెంట్స్, ఎలక్ట్రానికి డివైజెస్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరికరాల్లో అయోధ్యలోని రామమందిరం, కాశీలోని విశ్వనాథ్ టెంపుల్ కు సంబంధించిన రెక్కీ వీడియోలు, మ్యాప్ లు.. ఇతర ప్లాన్ లు ఉన్నట్లు సమాచారం.
ఈ రెండు దేవాలయాల టార్గెట్ తో పాటు వారి టార్గెట్ లో న్యూఢిల్లీలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నట్లు సమాచారం. వాటిలో.. సేనా భవన్ (Army Office), ఎయిర్ ఫోర్స్ కార్యాలయం, బీజేపీ ప్రధాన కార్యాలయం, పార్లమెంట్ హౌస్ రోడ్డు సమీపంలోని ప్రాంతాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బై మిస్టేక్ లో బాంబ్ బ్లాస్ట్
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్ ప్లాన్ లో భాగం కాదని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న కారులో పేలుడుకు కారణమైన పదార్థాలు ఉండటంతో.. అవి పట్టుబడతాయనే భయంతో లేదా ప్రణాళికలో లోపం కారణంగా ఆత్మాహుతి దాడి తరహాలో బాంబ్ బ్లాస్ట్ జరిపి ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో పేలుడు పదార్థాలను అభివృద్ధి చేయకపోవడం వల్ల పేలుడు తీవ్రత తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
Follow Us