Priyanka Gandhi:కేరళలోని వయనాడ్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తాజాగా తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బుధవారం భారీ ర్యాలీ, రోడ్ షో, బహిరంగ సభ తర్వాత నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీ.. ఈ సందర్భంగా ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తంగా రూ.12 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. తన భర్త రాబర్ట్ వాద్రా పేరుపై రూ.65 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇక 2023-2024 ఆర్థిక ఏడాదిలో అద్దెలు, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయాన్ని పొందినట్లు ప్రియాంక వివరించారు. ఇక ఆమెకు ఉన్న రూ.12 కోట్ల ఆస్తుల్లో రూ.7.74 కోట్ల స్థిరాస్తులు.. రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయని చెప్పారు. తనకు 3 బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నట్లు ప్రియాంక చెప్పుకొచ్చారు.
Also Read: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, తన భర్త రాబర్డ్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4.4 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు చెప్పారు. ఇక తన వద్ద ఉన్న స్థిరాస్తుల్లో ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో రెండు వ్యవసాయ భూములు, ఫామ్‌హౌస్‌లో సగం వాటా ఉన్నట్లు ప్రియాంక పేర్కొన్నారు.
Also Read: జానీ మాస్టర్ కు బెయిలొచ్చింది, 'పుష్ప2' షూట్ లో జాయిన్ అవుతారా?
రెండు ఎఫ్ఐఆర్‌లు..
మరోవైపు.. తన పేరు మీద సొంతంగా హిమాచల్ ప్రదేశ్‌లో సిమ్లాలో ఓ బంగ్లా ఉన్నట్లు చెప్పారు. దాని విలువ రూ.5.63 కోట్లు అని తెలిపారు. తన పేరు మీద రూ.15.75 కోట్ల మేర అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఇక తన మీద రెండు ఎఫ్ఐఆర్‌లు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఒక నోటీసు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రియాంక గాంధీ పొందుపరిచారు.
Also Read: బ్లింకిట్‌లో ఈఎంఐ ఆప్షన్..కొన్ని కొనుగోళ్ళకు మాత్రమే
మరోవైపు.. తన భర్త, బిజినెస్‌మెన్ రాబర్ట్ వాద్రాకి రూ.37.9 కోట్లు విలువ గల చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఇక తన విద్యకు సంబంధించిన వివరాలను కూడా ప్రియాంక గాంధీ అఫిడవిట్‌లో వెల్లడించారు.