హర్యానాలో ఫలించిన  బీజేపీ వ్యూహం..గెలిపించిన సీఎం సైనీ

హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపాయి.ఎగ్జిట్ పోల్స్ కు వ్యతిరేకంగా బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసి విజయం సాధించింది. దానికి కారణం ఎన్నికల ముందు బీజేపీ అనుసరించిన సీఎం మార్పు వ్యూహమే అంటున్నారు.

author-image
By Manogna alamuru
haryana
New Update

CM Nayab Saini: 

హర్యానాలో అంతా తారుమారు అయిపోయింది. ఇక్కడ బీజేపీ పని అయిపోయింది. ఈసారి కాంగ్రెస్సే కచ్చితంగా గెలుస్తుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా హస్తం పార్టీ హవానే నడిచింది. కానీ అసలు ఫలితాలు వచ్చేసరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది.  పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకే స్థానిక ప్రజలు పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ ఓటమికి కుల సమీకరణాలే కారణంగా తెలుస్తోంది. జాట్ సామాజికవర్గానికి కాంగ్రెస్ పెద్దపీట వేయడమే దెబ్బకొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

సర్వేలతో జాగ్రత్త పడిన బీజేపీ..

చాలా రోజుల నుంచీ హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేల్లో వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే టాక్ వినిపించింది. దీంతో బీజేపీ గెలుపు వ్యూహాలను రచించింది. అందులో ఒకటే..హర్యానా సీఎం ను మార్చడం. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి...అర్జంటుగా కేంద్రం నుంచి నాయబ్ సింగ్ సైనీకి అప్పగించారు. ఇదే బీజేపీకి బాగా హెల్ప్ చేసింది. కేవలం 200 రోజుల్లోనే పార్టీని ఓటమి కోరల నుంచి తప్పించి చారిత్రక విజయం దిశగా నాయబ్‌ నడిపించారు.  హర్యానాలో 18-20 స్థానాల్లో ఓబీసీ ఓటర్లు ప్రభావం ఉంటుందని నమ్ముతారు. ఓబీసీ నేత సైనీతో పాటు బీజేపీ 24 మంది ఓబీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ కూడా 20 మంది వెనకబడిన వర్గాల నేతలకు టిక్కెట్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే తగిలింది.

అంతకు ముందు హర్యానాలో తొమ్మిదిన్నరేళ్ళు మనోహర్ లాల్ ఖట్టర్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం కూడా గ్రహించింది. అందుకే అర్జంటుగా సైనీని రంగంలోకి దింపింది. దానికి తోడు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్న బీజేపీకి హర్యానాలో హ్యట్రిక్ కొట్టడం చాలా ప్రాముఖ్యంగా మారింది. ఈ రాష్ట్రంలో బీజేపీ పాలనను వదలాలనుకోలేదు అధినాయకత్వం. దాని కోసమే ఎన్నికల ముందు వ్యూహాలకు పదును పెట్టింది. అధిష్టానం కోరిక మేరకు నాయబ్ సింగ్ సైనీ కూడా చాలా ప్రతిభావంతంగా పని చేశారు. మాజీ సీఎం ఖట్టర్‌‌ను కలుపుకుని ఎన్నికల్లో పార్టీని నడిపించారు. ఖట్టర్‌‌ కూడా తనకు అన్ని చోట్లా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో సైనీకి సహకరించారు. 

అన్నీ తానై..

ఈసారి మొత్తం హర్యానా ఎన్నికల్లో అన్నీ తానే ముందుండి నడిపించారు  నాయబ్ సైనీ. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ప్రధాని మోదీ హర్యానాలో బాగా ప్రచారం చేశారు. కానీ ఈసారి కేవలం నాలుగు సార్లు మాత్రమే ర్యాలీలకు హాజరయ్యారు. అయితే ఆ లోటు ఎక్కడా కనబడనీయకుండా సైనీ కవర్ చేసుకొచ్చారు. గెలిస్తే ఆ ఘనత పార్టీ.. ఓడితే ఆ బాధ్యత నాది’ అని తేల్చిచెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి హర్యానాలో బీజేపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.  రైతు దీక్షలు, అగ్ని పథ్‌ లతో పార్టీ సతమతమవుతోంది.  వీటి నుంచి పార్టీని బటకు పడేయడానికి సైనీకి కేవలం రెండున్నర నెలలటైమే దొరికింది. దాని తర్వాత ఎన్నికల కోడ్ ప్రారంభం అయిపోయింది. అయితే ఆ దొరికిన కొద్ది కాలంలోనే ఆయన మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించి ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు. చాలా ఉద్యోగాలకు ముందు నోటిఫికేషన్లు జారీ చేశారు. గ్రామ పంచాయతీల వ్యయాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షలకు పెంచారు. దీంతో క్షేత్ర స్థాయిలో మరిన్ని అభివృద్ధి పనులకు వీలు కలిగింది. కరెంట్ బిల్లులను తగ్గించారు.
ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ యోజన అనుబంధంగా రాష్ట్రంలో మరో పథకాన్ని సైనీ సర్కారు ప్రారంభించింది. దీని కింద పేద కుటుంబాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానళ్లను పంపిణీ చేసేలా ప్లాన్ చేశారు. వీటన్నిటితో పాటూ అగ్నిపథ్‌తో పెరిగిన అసంతృప్తిని చల్లార్చేందుకు అగ్నివీర్ పాలసీ –2024ను తీసుకొచ్చారు. దీంతో అగ్నివీర్‌‌లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మీద ప్రభావం చూపించాయి. మొత్తానికి నయాబ్ సైనీ కష్టం, గెలుపుకు వేసిన బాలు ఫలితాన్ని చూపించాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేలా చేశాయి. 

Also Read: Vinesh Phogat:ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో చూపించిన వినేశ్ ఫోగాట్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe