యా.. యా.. అనడానికి ఇది కాఫీ షాప్ కాదు.. చీఫ్ జస్టీస్ ఫైర్!

మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా.. యా యా.. ఎస్ అనడంపై అసహనం వ్యక్తం చేశారు. పదే పదే యా అని చెప్పడానికి ఇది కాఫీ షాప్ కాదు.. ఇది కోర్టు అంటూ చురకలంటించారు. 

rjn
New Update

D Y Chandrachud: మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై చీఫ్ డీవై జస్టీస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా.. యా యా.. ఎస్ అనడంపై అసహనం వ్యక్తం చేశారు. పదే పదే యా అని చెప్పడానికి ఇది కాఫీ షాప్ కాదు.. ఇది కోర్టు అంటూ చురకలంటించారు. ప్రతిదానికి ఎస్ ఎస్ అంటుంటే తనకు చిరాకుగా ఉందంటూ మండిపడ్డారు. 

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం పూణెకు చెందిన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. సర్వీస్ వివాదానికి సంబంధించిన అభ్యర్ధనను అతను ఇంతకు ముందు తోసిపుచ్చడంపై అంతర్గత విచారణ జరపాలని పిటిషన్ కోరింది. ఈ సందర్భంగా మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై పిల్‌పై చంద్రచూడ్ విరుచుకుపడ్డారు. న్యాయపరమైన సమస్యలు, విధానపరమైన అభ్యంతరాలను వ్యాజ్యదారులకు అర్థమయ్యేలా సీజేఐ మరాఠీలో కూడా మాట్లాడారు. న్యాయస్థానంలో ఒక న్యాయవాది అనధికారిక భాషను ఉపయోగించారని, దానికి గౌరవం లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ విమర్శించారు. మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ప్రమేయం ఉన్న ప్రజాహిత వ్యాజ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి కేసుల్లో న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకోవడం తగదని నొక్కి చెప్పారు.

'మీరు ఒక న్యాయమూర్తిని ప్రతివాదిగా ఎలా పిఐఎల్ దాఖలు చేస్తారు? కొంత గౌరవం ఉండాలి. న్యాయమూర్తిపై అంతర్గత విచారణ కావాలని మీరు చెప్పలేరు' అని జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అన్నారు.   

Also Read: న్యూజిలాండ్‌లో ఆర్థిక సంక్షోభం.. విదేశాలకు పెరుగుతున్న వలసలు

#supreme-court #cji-chandrachud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe