ఘోర విషాదం.. ఇంటిమీద పిడుగుపడి 8 మంది మృతి!

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్‌నంద్‌గావ్ జిల్లా జోరటరాయ్ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురు విద్యార్థులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తికి పోలీసులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.  

New Update
sdre

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. జోరటరాయ్ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురు పాఠశాల విద్యార్థులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమ్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జోరటరాయ్ గ్రామంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై రాజ్‌ననద్‌గావ్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ప్రాథమిక సమాచారం ప్రకార గ్రామానికి సమీపంలో ఉన్న కాంక్రీట్ వెయిటింగ్ రూమ్‌లో ఆశ్రయం పొందుతున్న ఎనిమిది మంది వ్యక్తులు పిడుగుపాటుకు మరణించారు. పిల్లలు, ఇతరులు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు వర్షం పడుతుండటంతో ఓ గదిలో తలదాచుకున్నారు. ఈ క్రమంలోనే వారున్న గది గొడపై పిడుగుపడటంతో అక్కడిక్కడే మరణించినట్లు తెలిపారు. ఇక మృతులు సమీపంలోని మూడు గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. మరణించిన ఐదుగురు పిల్లలు ఎనిమిది నుండి పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించగా గాయపడ్డ వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు