Chess Trophy: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కార్యాలయంలోని చెస్ ఒలింపియాడ్ ట్రోఫీ కనిపించకుండా పోయింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏఐసీఎఫ్‌కు ఇబ్బందిగా మారింది. గతేడాది స్వదేశంలో జరిగిన చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరించినందుకు భారత జట్టుకు ఈ ట్రోఫీని అందించారు.
దీన్ని అధికారులు ఫెడరేషన్ కార్యాలయంలో భద్రపరిచారు. దీంతో ఏఐసీఎఫ్ ట్రోఫీ ప్రతిరూపాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు వివరించి ట్రోఫీ కనిపించకుండా పోవడం గురించి క్షమాపణ చెప్పింది. ట్రోఫీ కనిపించకుండా పోయిన ఘటన పై ఏఐసీఎఫ్ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ స్పందించారు. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ఈ ట్రోఫీని బుడాపెస్ట్ కు తీసుకురావాలని చెప్పింది. దీంతో ట్రోఫీ కనిపించకుండా పోయిన విషయం వెలుగులోకి వచ్చింది.
నెలరోజుల నుంచి దీన్ని వెతుకుతున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ కోరడంతో కనిపించకుండాపోయిన ట్రోఫీ కోసం అంతా వెతికినట్లు ఆయన తెలిపారు. కానీ దాని జాడ కనిపెట్టలేకపోయాం. ఇది మాకు చాలా గడ్డు పరిస్థితి. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితికి క్షమాపణలు చెబుతున్నాం అని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.