Rahul:రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దుపై పిటిషన్..ఆలోచిస్తున్నామన్న కేంద్రం

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ద్వంద్వ డబుల్ పౌరసత్వం మీద దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తున్నామని కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు చెప్పింది. ఈ కేసు తరువాతి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. 

rahull
New Update

రాహుల్ గాంధీపై సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ద్వంద్వ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో చెప్పారు. దీనిపై అలహాబాద్ హైకోర్ట్ విచారించింది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆధారాలు ఉన్నట్లు పిటిషనర్ ఆరోపించారు. వీఎస్ఎస్ శర్మ చేసిన విచారణలో యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈమెయిళ్లను చూపించారు. ఇంతకు ముందు కూడా ఈ కేసుపై విచారణ జరిగింది. అప్పుడు ఈ కేసుపై నవంబర్ 25 డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే, ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్వీకరించినట్లు.. దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ లోగా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని జస్టిస్ అట్టౌ రెహమాన్ మసూది, జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

రెండు పౌరసత్వాలు చెల్లవు..

భారత రాజ్యాంగం ఆర్టికల్ 9 ప్రకారం ఏ వ్యక్తి రెండు దేశాల పౌరసత్వాలను ఏకకాలంలో కలిగి ఉండకూడదు. తప్పనిసరి అయితే ఏదో ఒక దేశ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుం దీనిపై ఒక కేసు అలహాబాద్ హైకోర్ట్‌లో ఉంది. అదీ కాక ఇదే విషయం మీద బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అలహాబాద్ హైకోర్టు విచారణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కేసును విచారిస్తామని ఢిల్లీ కోర్టు సూచించింది.

Also Read: USA: దిగుమతి సుంకాలపై ట్రంప్ పోస్ట్..తీవ్రంగా స్పందించిన చైనా రిప్లై

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe