BJP vs JSP  :  ఎన్నికల్లో రచ్చ రచ్చ.. కారు పచ్చడి పచ్చడి!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్‌పురా జిల్లాలోని బార్బిఘా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జన సూరజ్ పార్టీ మద్దతుదారులు,  భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

New Update
bihar

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షేక్‌పురా జిల్లాలోని బార్బిఘా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జన సూరజ్ పార్టీ మద్దతుదారులు,  భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. బార్బిఘా ప్రాంతంలోని వారిసలిగంజ్ నియోజకవర్గంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను పోలింగ్‌కు తరలించే విషయంలో లేదా పోలింగ్ ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా ఈ ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరడంతో, ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

హింస సందర్భంగా ఒక కారు ధ్వంసం చేయబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధ్వంసమైన కారు జన సూరజ్ పార్టీ మద్దతుదారులకు చెందినదిగా భావిస్తున్నారు. జన సూరజ్ పార్టీకి చెందిన అభ్యర్థి ఒకరు మాట్లాడుతూ, తమ మద్దతుదారులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, తమపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది, ఇది కేవలం పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవడానికి జన సూరజ్ చేసిన ప్రయత్నంగా పేర్కొంది. ఘర్షణ జరిగిన వెంటనే పోలీసులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) నిషు మల్లిక్ నేతృత్వంలో బృందం వెంటనే రంగంలోకి దిగింది. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు.

ఇక మిగితా ప్రాంతాల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒకపక్కా చలి చంపేస్తున్న ఓటర్లు ఉత్సహంతో ఓటు వేసేందుకు పోలింగ్ బూతుల వైపు బారులు తీరుతున్నారు. 9 గంటల సమయానికి 14.5శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే, గయ జిల్లా అత్యధికంగా 15.97% ఓటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, మధుబని జిల్లా అత్యల్పంగా 13.25% ఓటింగ్‌తో ఉంది.

ఈ రెండో దశలోనే  నితీష్ కుమార్ మంత్రివర్గంలోని 12 పైగా మంత్రులతో సహా పలువురు ముఖ్య నాయకుల భవితవ్యం తేలనుందిజ. మొదటి దశ పోలింగ్‌లో చారిత్రాత్మకంగా 64.66% ఓటింగ్ నమోదు కావడంతో, ఈ రెండో దశ ఓటింగ్ శాతంపై కూడా అందరి దృష్టి ఉంది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నేపాల్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి సరిహద్దులను మూసివేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.

Advertisment
తాజా కథనాలు