Athawale Ramdas: రాహుల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి: కేంద్ర మంత్రి

అమెరికా పర్యటనలో రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే కౌంటర్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు రాహుల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

New Update
Athawale Ramdas

Athawale Ramdas: అమెరికా పర్యటనలో రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశంలో వీలైతే రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శల బాణాలు విసురుతున్నారు. ఇప్పటికే దీనిపై పలువురు బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై మాటల దాడి చేయగా.. తాజాగా కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.

పాస్‌పోర్ట్ రద్దు చేయండి..

రాహుల్ గాంధీ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నశిస్తుంది కానీ రిజర్వేషన్ నశించదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ పిల్లతనం వదిలేయాలని హితవు పలికారు. దేశం బయటకు వెళ్లి దేశాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం రిజర్వేషన్‌ను అంతం చేయదు ఎందుకంటే ఆయన ప్రభుత్వం రాదు అని చురకలు అంటించారు.

రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశంపై ఇలాంటి ప్రకటనలు చేయవద్దని కోరారు. బయట దేశాల్లో భారత్ పై ఇలాంటి ప్రసంగాలు చేయకుండా ఉండేందుకు రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని అన్నారు. అంతే కాకుండా అజిత్ పవార్ వల్ల మహాకూటమికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అజిత్ పవార్‌కు 17 లోక్‌సభ స్థానాల్లో కూడా వాటా ఉంది, అయితే రాజ్ ఠాక్రేకు మహాకూటమితో ఎలాంటి సంబంధం లేదు. రాందాస్ అథవాలే కూడా నా వల్ల రాజ్ ఠాక్రేను మహాయుతి తీసుకోవద్దని అన్నారు.

రాహుల్ గాంధీ ఏం చెప్పారు?

ఇటీవల అమెరికాలో పర్యటించారు రాహుల్ గాంధీ. ఈ పర్యటనలో భాగంగా జార్జ్‌టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించారు. అయితే.. భారత్ అభివృద్ధి, రిజర్వేషన్లపై విద్యార్థులు రాహుల్ గాంధీని అడగగా.. ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు రావడంకోసం రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రిజర్వేషన్ల వల్ల కొందరికి లాభం చేకూరగా.. మరికొంత మందికి నష్టం చేకూరుస్తుందని అన్నారు. కాగా లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి అదిఆకారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై మాట్లాడడంపై బీజేపీ విమర్శల దాడికి దిగింది.

Advertisment
తాజా కథనాలు