New Income Tax Act 2025 : టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయపు పన్ను (Income Tax) కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనం ప్రతి ఏటా కట్టే పన్ను విధానాన్ని మరింత సులభం చేస్తూ, పాత రూల్స్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.

New Update
nirmama

ఇప్పటిదాకా ఆదాయపు పన్ను కట్టాలంటే చాలా కష్టమైన ఫారాలు, పెద్ద పెద్ద రూల్స్ ఉండేవి. ఏప్రిల్ 1 నుంచి వాటిని తీసేసి ఎవరైనా సరే సొంతంగా ఫైల్ చేసుకునేలా చాలా చిన్న ఫారాలను తీసుకువస్తున్నారు.

మీకు రావాల్సిన టాక్స్ రిటర్న్స్ (ITR) ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ఇప్పటిదాకా డిసెంబర్ 31 దాకా టైమ్ ఉండేది. ఇకపై ఆ టైమ్‌ను మార్చి 31 దాకా పెంచారు. అంటే మరో 3 నెలల టైమ్ దొరుకుతుందన్నమాట.

ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు లేదా గాయపడినప్పుడు కోర్టు ద్వారా పరిహారం అందుతుంది. ఆ డబ్బుపై వచ్చే వడ్డీ మీద ఇకపై పన్ను కట్టక్కర్లేదు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట అనే చెప్పాలి. 

ఒకే టాక్స్ ఇయర్

ఇప్పటిదాకా అసెస్మెంట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అని రెండు రకాల టైమ్స్ ఉండటంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఇకపై ఆ గందరగోళం లేకుండా ఒకే టాక్స్ ఇయర్ విధానాన్ని తీసుకురానున్నారు. 

మీకు రావాల్సిన టీడీఎస్ డబ్బులను ఐటీ రిటర్న్స్ గడువు ముగిసినా సరే, ఎలాంటి ఫైన్ కట్టకుండానే తిరిగి పొందేలా రూల్స్ మార్చారు.

Advertisment
తాజా కథనాలు