ఈ మధ్య కాలంలో భారత విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు అధికం అవుతున్నాయి. కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తున్న నకిలీ బాంబు బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈ ఒక్క రోజు 80కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగో విమానాలకు బాండు బెదిరింపులు వచ్చాయి. గత 11 రోజుల్లో ఇలా మొత్తం 250కి పైగా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?
మళ్లీ బాంబు బెదిరింపులు..
బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే విమానాలను తనిఖీ చేశారు. అయిన ఎలాంటి అనుమానస్పదమైన వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. ఈ బాంబు బెదిరింపులు నకిలీవని తెలిసిన కూడా విమానయాన సంస్థలు సీరియస్‌గానే తీసుకుంటున్నాయి. ఇలా బెదిరింపులు వచ్చిన వెంటనే విమానాలను ఆపి, రీషెడ్యూల్ చేస్తున్నారు. దీంతో ప్రయాణాలకు ఆటంకం కలుగుతుంది.
ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!
విమాన బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దుండగులను పట్టుకుని.. వారు జీవితంలో విమాన ప్రయాణం చేయకుండా నోఫ్లై జాబితాలో చేర్చడానికి కఠినమైన చట్టాలు తీసుకొస్తామన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారికి జీవితఖైదు శిక్ష విధించాలన్నారు.
ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎక్కువగా ఢిల్లో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు వచ్చిన వెంటనే అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీ చేస్తున్నారు. ఇలా బెదిరింపులు వచ్చిన ప్రతీసారి తనిఖీలు నిర్వహించగా.. ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించలేదు.
ఇది కూడా చూడండి: దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో..