హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు

హీరోయిన్‌ తమన్నాకు బిగ్ షాక్‌ తగిలింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో ఆమెను ఈరోజు ఈడీ విచారించింది. 5 గంటల పాటు తమన్నాపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. గౌహతీలోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ సాగింది. 

New Update

 Heroin Tamannah: 

డబ్బులు వస్తున్నాయని చాలావాటికి ప్రమోషన్స్ చేస్తుంటారు హీరో, హీరోయన్లు. ఎక్కువ మొత్తంలో మనీ ఆఫ్ చేయడమే ఇందుకు కారణం. అయితే అవే ఒక్కోసారి సెలబ్రిటీ తలలకు చుట్టుకుంటాయి. ఇంతకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్‌ విషయంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్‌‌లు ఇలాగే చిక్కుకున్నారు. ఈడీ విచారణలతో విసిగిపోయారు. ఇప్పుడు తాజాగా తమన్నా వంతు. హెజ్పీజె టోఎన్ అనే యాప్ విషయంలో మిల్కీ బ్యూటీ తమన్నాను ఈరోజు ఈడీ విచారించింది. 

Also Read: యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్ ..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం

https://rtvlive.com/telangana/yadadri-laddu-ghee-is-purelab-test-reports-proved-7335050

హెచ్పీజె టోకెన్ యాప్..

బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల మైనింగ్ కోసం డబ్బు పెట్టుబడి పెట్టడం అనే కాన్సెప్ట్ తో హెచ్పీజె టోకెన్ అనే యాప్ వచ్చింది. ఇది ఒక రకమైన బెట్టింగ్ యాప్. దీనికి తమన్నా ప్రమోషన్స్ చేసింది. ఈ హెచ్పీజె టోకెన్ నిర్వహించిన ఒక ఈవెంట్‌లో తమన్నా పాల్గొంది. ఫెయిర్‌ ప్లే బెట్టింగ్ యాప్‌లో IPL చూడాలని తమన్నా ప్రచారం చేసింది.  ఇప్పుడు అదే ఆమెను ఈడీ విచారించేలా చేసింది. ఈ హచ్పీజె టోకెన్ యాప్ ద్వారా కంపెనీ మోసాలకు, మనీ లాండరింగ్‌కు పాల్పడింది అంటూ దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కొహిమా పోలీస్ స్టేషన్లల కేసు నమోదయింది. అక్కడి ఎఫైఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈడీ తమన్నాను కూడా విచారించింది.  హెచ్పీజె నిర్వహించిన ఈవెంట్‌లో తమన్నా ఎంత డబ్బులు తీసుకుంది...వారు డబ్బు ఏ రూంలో చెల్లించారు లాంటి ప్రశ్నలు ఈడీ తమన్నాను అడిగినట్లు తెలుస్తోంది. దాదాపు 5 గంటలపాటూ ప్రశ్నించినట్లు సమాచారం. గౌహతీలోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ సాగింది. దీనికి మిల్కీ బ్యూటీ తల్లిని వెంట పెట్టుకుని వచ్చింది. అయితే ఈ కేసులో తమన్నా నిందితురాలు కాదని...ఆమెను కేవలం హెచ్పీజె టోకెన్ వివరాలను తెలుసుకోవడం మాత్రమే పిలిపించామని ఈడీ చెప్పింది. 

Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe