సాధారణంగా మనం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, బ్లూ మూన్ లాంటి అద్భుతాలను అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే మీరు బ్లాక్ మూన్ గురించి ఎప్పుడైనా విన్నారా. అయితే డిసెంబర్ 30న ఆకాశంలో ఈ బ్లాక్ మూన్ ప్రత్యక్షం కానుంది. అమెరికాలో ఉన్నవాళ్లు డిసెంబర్ 30న సాయంత్రం 5.27 PM గంటలకు ఈ అద్భుతాన్ని చూడవచ్చు. ఇక డిసెంబర్ 31న యూరప్, ఆఫ్రికా, ఆసియాలో ఉండేవారికి ఇది కనిపిస్తుంది. మన ఇండియాలో ఈ బ్లాక్ మూన్‌ను డిసెంబర్ 31న ఉదయం 3.57 గంటలకు చూడవచ్చు. Also read: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన బ్లాక్‌మూన్ అంటే ఏంటి ? ఇక వివరాల్లోకి వెళ్తే.. భూమిపై 29.5 రోజులు గడిస్తే.. చంద్రునిపై ఒకోరోజు గడిచినట్లు. అంటే భూమిపై ఒక నెల.. చంద్రునిపై ఒక రోజుతో సమానం. అయితే ఒక నెలలో రెండోసారి అమావాస్య వచ్చినప్పుడు ఈ బ్లాక్ మూన్ అనేది ఏర్పడుతుంది. వాస్తవానికి ఈ బ్లాక్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. బ్లాక్ మూన్ సంభవించినప్పుడు చంద్రుడు కనిపించడు. కానీ దీని ప్రభావం ఆకాశంలో కనిపిస్తుంది. చంద్రునిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. చీకటి ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ కాంతిలోనే మనం నక్షత్రాలు, గ్రహాలు ఆఖరికీ గెలాక్సీలను కూడా స్పష్టంగా చూడవచ్చు. బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ సాయంతో జ్యూపిటర్ (గురుడు), వీనస్ (శుక్రుడు) లాంటి గ్రహాలను చూడొచ్చు. Also Read: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లికొడుకు! బ్లాక్ మూన్ ఎలా ఏర్పడుతుంది? సూర్యుడు, చంద్రుడు సమాతరంగా ఒకే దిశలో ఉన్నప్పుడు.. చంద్రుడు భూమికి ప్రకాశవంతంగా కనిపించడు. సూర్యునికి ఇది ఎదురుగా ఉండటం వల్ల దీనిపై కాంతి పడదు. దీంతో ఆ రాత్రి బ్లాక్ మూన్ ఏర్పడుతుందని చెబుతుంటారు. ఖగోళశాస్త్రంలో ఇది అధికారిక పదం కాకపోయినప్పటికీ.. ఖగోళ ప్రేమికులు దీన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రెండో అమావాస్య వస్తుంది కాబట్టే ఈ బ్లాక్ మూన్ సంభవించనుంది. Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన