BIG BREAKING: పక్షిని ఢీకొట్టిన ఎయిరిండియా ఫ్లైట్!

నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్‌లో సౌండ్‌ రావడంతో గుర్తించిన పైలట్‌.. విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు.

New Update
Air India

Air India

మహారాష్ట్రలో ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 ఫ్లైట్ శనివారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. నాగ్‌పూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. ఇంజన్‌లో సౌండ్‌ రావడంతో గుర్తించిన పైలట్‌.. విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు. నాగ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. విమాన మరమ్మతులకు అధిక సమయం అవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు ఇండిగో విమానాలను దారి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. పశ్చిమ బెంగాల్‌, బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు